Baby Twitter Review: బేబీ ట్విట్టర్ రివ్యూ: సినిమా హిట్టా? ఫట్టా?

ఆనంద్, వైష్ణవి చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. కలిసి చదువుకుంటారు. ఆనంద్ కి చదువు అంతగా అబ్బదు. దానికి తోడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు. తండ్రి లేని ఆనంద్ కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తుతాడు.

  • Written By: Shiva
  • Published On:
Baby Twitter Review: బేబీ ట్విట్టర్ రివ్యూ: సినిమా హిట్టా? ఫట్టా?

Baby Twitter Review:  ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకుడిగా ఉన్నారు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కిన బేబీ చిత్ర ప్రీమియర్స్ ముగిశాయి. దీంతో సోషల్ మీడియాలో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి బేబీ సినిమా హిట్టా? ఫట్టా?…

కథ:

ఆనంద్, వైష్ణవి చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. కలిసి చదువుకుంటారు. ఆనంద్ కి చదువు అంతగా అబ్బదు. దానికి తోడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు. తండ్రి లేని ఆనంద్ కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తుతాడు. మరోవైపు వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి నగరంలో ఇంజినీరింగ్ చేరుతుంది. ఒకరంటే మరొకరికి ప్రాణం. ఘాడంగా ప్రేమించుకుంటారు. చదువు కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నల్లగా ఉన్న వైష్ణవికి కాలేజీలో అవమానాలు ఎదురవుతాయి. ఆ క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న విరాజ్ ఆమెకు అండగా నిలబడతాడు. వైష్ణవి జీవితం మారిపోతుంది. అటు విరాజ్ కూడా ప్రేమిస్తూ ఉంటాడు. దీంతో ట్రయాంగిల్ స్టార్ట్ అవుతుంది… మరి వైష్ణవి ఎవరికీ దక్కిందనేది కథ..

ట్విట్టర్ ఆడియన్స్ అభిప్రాయంలో బేబీ సమకాలీన ప్రేమ కథ. ఈ తరం ప్రేమికులు ఎలా ఉంటారు. ఇక అమ్మాయి జీవితంలోకి ఇద్దరు అబ్బాయిలు వస్తే ఎలా ఉంటుందో చెప్పారు. యూత్ కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు మెప్పిస్తాయి. కొంత మేర లవ్ ఎమోషన్ వర్క్ అవుట్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ చక్కగా నటించారు. తమ పాత్రలకు న్యాయం చేశారు.

అయితే సినిమా సాగతీతకు గురైంది. పట్టులేని స్క్రీన్ ప్లే కారణంగా బోరింగ్ గా సాగుతుంది. సన్నివేశాలు రిపీట్ అవుతున్న భావన కలుగుతుంది. కామెడీ యాంగిల్ లేదు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ కి కామెడీ కూడా అవసరం. అది బేబీ మూవీలో లేదు. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా అలానే మెల్లగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా అంత ప్రభావవంతంగా లేదు.

బేబీ మూవీలో అలరించే సన్నివేశాలు, ఆకట్టుకునే డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. మొత్తంగా మాత్రం యావరేజ్ మూవీ అంటున్నారు. సెలబ్రిటీలు, పీఆర్వోలు మూవీ అద్భుతం అంటూ ఊదరగొడుతున్నా అంత లేదంటున్నారు. ట్విట్టర్ ఆడియన్స్ అభిప్రాయం అలా ఉంది.

https://twitter.com/teju_uppalpati/status/1679675789401534464

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు