The Survey Of Pawan Kalyan Janasena : ఆంధ్రాలో సర్వే రిపోర్టుల గందరగోళం ఎక్కువైంది. విశాఖ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. తగ్గించేలా ఈ సర్వే రిపోర్టులు బయటకు తీశారని అనుమానం రాకమానదు. ఇది కావాలని జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఇవ్వాల్టి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయనీ చెప్పొచ్చు. ఈ గందరగోళంలోకి జనసేన వెళ్లకూడదన్నది మన పాయింట్.
ఈ సర్వేల్లో జనసేన వెనుకబడి ఉండొచ్చు. కానీ ఆరు నెలల తర్వాత ఎన్నికలకు ముందు జరిగే ప్రజల నాడి డిఫెరెంట్ గా ఉంటుంది. అప్పుడు కంప్లీట్ గా ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలు డిసైడ్ అవుతారు. అప్పుడు చేసిన సర్వేలకే విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది.
విశ్వసనీయమైన సంస్థలు ఇచ్చే సర్వేలనే మనం నమ్మాలి. ఇక పార్టీలకు ఫేవర్ గా ఉంటే సర్వేలను అస్సలు నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు సర్వేలను బట్టి పొత్తులపై మాట్లాడుకోవడం లో అర్థం లేదు.. పర్థం లేదు.
కొత్తగా అధికారంలోకి వచ్చే పార్టీలను చూస్తేనే సొంతంగానే అధికారంలోకి వస్తుంది. పోయినసారి వైసీపీ అలానే వచ్చింది. బెంగాల్ లో మమత.. తమిళనాడులో డీఎంకే ఇలానే వచ్చాయి. అందుకే ఈ సర్వేల్లో ఇప్పుడు జనసేన వెనుకబడి ఉందని పొత్తుల కోసం వెంపర్లాడడం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.
ఏపీలో సర్వేలు.. వచ్చేసారి అధికారంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.