Kapu Leaders Support to Janasena : ఆంధ్రా రాజకీయాల్లో కుల సమీకరణాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఎన్ని సిద్ధాంతాలు బయటకొచ్చినా ఆంధ్రాలో ఇప్పటివరకూ రెండు సామాజికవర్గాలే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. ఇందులో రాజకీయ అంశాలే కాదు.. సామాజికపరమైన అంశాలు కూడా ఉన్నాయి.
కమ్మ, రెడ్డిలు మాత్రమే ఏపీలో రాజ్యాధికారం సాధించాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం ఈసారి ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతోంది? అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాజకీయ పండితులు అందరూ ఇదే విశ్లేషిస్తున్నారు.
చరిత్ర చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ.. మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్రాలో కానీ.. 2014 తర్వాత ఆంధ్రాలో కానీ.. ఏనాడు కాపు సామాజికవర్గం వ్యక్తులు ముఖ్యమంత్రిగా రాలేదు.సంఖ్య పరంగా అందరికన్నా ఎక్కువ ఉన్నా కూడా అధికారాన్ని సాధించడంలో కాపులు దూరమయ్యారు. అధికారాన్ని సాధించడం అనేది ఒక తీరని అడియాశగానే మిగిలిపోయింది.
2009లో చిరంజీవి రూపంలో ప్రజారాజ్యంతో కాపుల పార్టీగా జనం ముందుకు వచ్చింది. పరిమితులతో కుట్రలతో ప్రజారాజ్యంను చిరంజీవి కమ్మ, రెడ్డిలు చిదిమేశారు. చిరంజీవిని నైతికంగా దెబ్బతీశారు. అయినా చిరంజీవి 18 మంది ఎమ్మెల్యేలను చిరంజీవి గెలిపించారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపులు అధికారం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు జనసేనాని పవన్ వారికి ఆశాదీపంలా ఉన్నారు.
కాపు సామాజికవర్గం ఎటువైపు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..