Analysis On Gujarat Elections : ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనాలు సృష్టించబోతుందా?
Analysis On Gujarat Elections : గుజరాత్.. అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రధాని నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి.. గుజరాత్ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. దేశ ప్రజల మన్ననలు పొందారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం కావడం, అక్కడ బీజేపీ 25 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ఈ సారి ఎవరు గెలుస్తారని యావత్ […]

Analysis On Gujarat Elections : గుజరాత్.. అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రధాని నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి.. గుజరాత్ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. దేశ ప్రజల మన్ననలు పొందారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం కావడం, అక్కడ బీజేపీ 25 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ఈ సారి ఎవరు గెలుస్తారని యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సారి అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈసారి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, పార్టీల దృష్టంతా గుజరాత్‌పై ఉంది.
గుజరాత్‌లో తాజా పరిస్థితిపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, లోక్‌నీతి సర్వే చేశాయి. వారి అధ్యయనం ప్రకారం.. ఇప్పటికీ బీజేపీ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిర్ధారించాయి. మూడింట రెండో వంతు బీజేపీకి మద్దతుగా ఉన్నారని తెలిపింది. బీజేపీ వ్యతిరేక ఓట్లు మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు షేర్ చేసుకుంటాయని తెలిపింది.
బీజేపీ గుజరాతీల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. 25 ఏళ్లుగా పాలన సాగిస్తున్నా.. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. దీనికి పెద్ద పునాది ఉంది. చారిత్రక నేపథ్యం చూస్తే బీజేపీకి ముందు భారతీయ జనసంఘ మాత్రమే బలంగా ఉండేది. నాడు కాంగ్రెస్ ఆధిపథ్యమే కొనసాగేది. గాందీ, నెహ్రూ గుజరాతీలు కావడంతో.. నాడు ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేవారు. అయితే భారతీయతతో వచ్చిన భారతీయ జనసంఘ్.. కాంగ్రెస్‌ను క్రమంగా దెబ్బతీస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రాభవం చెదిరిపోతూ వచ్చింది. 1990వ దశకం తర్వాత నుంచి బీజేపీ ఆధిపత్యం పూర్తిగా కొనసాగుతోంది.
గుజరాత్ ఎన్నికలు.. ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనాలు సృష్టించబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.