Delhi Liquor Scam : అవినీతి దందాలో అందరూ ఒక్కటే. అక్కడ ఈ రాజకీయ వైరుధ్యాలు పనిచేయవు. పైకి జనాలకు చెవిలో పువ్వులు పెట్టడానికి కొట్లాటలు ఉన్నట్టు నటిస్తారు. ఆంధ్రా, తెలంగాణ మధ్య సెంటిమెంట్ రగిలిస్తారు. కానీ ఇదే ఆంధ్రా, తెలంగాణ నేతలు ఒక సంస్థను పెట్టి అందులో వ్యాపార భాగస్వాములు అవుతారు. అదే ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’. సౌత్ కార్టెల్ గ్రూపు డైరెక్టర్లుగా అరవిందో ఫార్మా ఒకవైపు.. రెండో వైపు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి.. మూడోవైపు కల్వకుంట్ల కవిత. జనాలకు సెంటిమెంట్.. ఓట్లు దండుకోవడానికి ఈ సెంటిమెంట్. కానీ వారి వ్యాపారాలకు మాత్రం అడ్డు రాదు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పెద్ద హీరోలుగా ప్రొజెక్ట్ అవుతున్నారు. జైలుకు వెళ్లడాన్ని ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఇది వరకూ జైలుకు వెళ్లిన వారిని ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర మనకుంది. జైలుకెళ్లి తిరిగి వచ్చిన వాళ్లకు జనం ఓట్లేస్తున్నారు.
నిన్న జగన్ ఇలానే జైలుకెళ్లి సీఎం అయ్యారు. ఇవాళ కవిత కూడా అలానే జైలుకు వెళతాననడం.. ఆమె వెంట జనాలు ,నేతలు మూగి హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు.
ఆంధ్రాలో తాజాగా ‘నైపుణ్య’ అవినీతికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నైపుణ్యశిక్షణ ఇవ్వడానికి 3వేల కోట్ల చిల్లర నిధులతో ఒక పథకం ప్రవేశపెట్టింది. దాంట్లో 10శాతం మాత్రమే ప్రభుత్వం వాటా అట.. 90 శాతం సీమెన్స్ సంస్థ ఇస్తుందట.. అందులో 50 కోట్లు ఖర్చు పెట్టిన ఈ సంస్థ 200 కోట్ల వరకూ షెల్ కంపెనీల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అసలు ఏపీలో ఈ నైపుణ్య శిక్షణ పేరిట జరిగిన అవినీతి ఏంటి? ఇందులో జరిగిన అవినీతిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.