CM Jagan Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పగలూ రాత్రి పవన్ కళ్యాణ్ కలలో వస్తున్నట్టుగా పరిస్థితి తయారైంది. జగన్ నిద్రపోతున్నాడా? లేదా నిద్రలో కూడా పవన్ కల్యాణ్ ను కలవరిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది. తాజాగా జగన్ అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఆ సభ మొత్తం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. అందులో టీవీలు, ప్రజల సాక్షిగా అబద్దాలు చెప్పుకొచ్చారు.
ఒక్కో రైతుకు 7 లక్షల రూపాయల పరిహారం చూపించాలని జగన్ సవాల్ చేశారు. అదే నిజమైతే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మూడు జిల్లాల్లో రైతు భరోసా యాత్ర చేశారు. చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందజేశారు. ఈ మూడు జిల్లాల్లో 200 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. వాళ్ల ఊర్లు, పేర్లు అన్నీ ప్రజల ముందే పెట్టాడు.
ఇందులో ఎవరు కౌలు రైతులు ఉన్నారో వారిని ఇదే జగన్ ప్రభుత్వం ఆదుకోలేదు. వారిని అసలు గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియకుండానే లక్ష రూపాయలు దానం చేసి వెళ్లిపోతున్నాడా? జగన్ చెబుతున్నవి అబద్దాలు కావా? అన్నది ఇక్కడ తేలిపోయింది.
పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తున్నారు. ఇదే పవన్ సాయం చేస్తున్న రైతులకు జగన్ 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి రాష్ట్రంలోనే ఆర్థిక సాయం అందుకోని వారు లేరు అని జగన్ అనడం అబద్దమేనని తేలిపోయింది. జగన్ విమర్శలు.. ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ శకం మొదలైన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.