Jagan vs Janasena : జనసేన బలపడేకొద్దీ సహనం కోల్పోతున్న జగన్
Jagan vs Janasena : నర్సాపూర్ లో జగన్ మాట్లాడింది వింటే.. రోజురోజుకు సహనం కోల్పోయి.. హుందాతనం కూడా కోల్పోతున్నాడని అర్థమవుతోంది. ఎందుకని ఇది జరుగుతోంది. ఇటీవల ఓపినియన్ పోల్ సర్వేల్లో నర్సాపురం జనసేన ఖాతాల్లోకి వెళుతుందని తేటతెల్లమైంది. నర్సాపురం చూడగానే జగన్ కు అక్కడ ఫస్ట్రేషన్ మొదలైంది. జనసేనను రౌడీ సేన అన్నది ఎందుకు అనాల్సి వస్తోందంటే.. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలు, వైఫల్యాలను ఎండగడుతున్నందుకు.. నిరసనలు చేస్తున్నందుకు ఇలా అన్నాడు. జనసేనకు జనం మద్దతు […]

Jagan vs Janasena : నర్సాపూర్ లో జగన్ మాట్లాడింది వింటే.. రోజురోజుకు సహనం కోల్పోయి.. హుందాతనం కూడా కోల్పోతున్నాడని అర్థమవుతోంది. ఎందుకని ఇది జరుగుతోంది. ఇటీవల ఓపినియన్ పోల్ సర్వేల్లో నర్సాపురం జనసేన ఖాతాల్లోకి వెళుతుందని తేటతెల్లమైంది. నర్సాపురం చూడగానే జగన్ కు అక్కడ ఫస్ట్రేషన్ మొదలైంది.
జనసేనను రౌడీ సేన అన్నది ఎందుకు అనాల్సి వస్తోందంటే.. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలు, వైఫల్యాలను ఎండగడుతున్నందుకు.. నిరసనలు చేస్తున్నందుకు ఇలా అన్నాడు. జనసేనకు జనం మద్దతు చూసి తట్టుకోలేకనే ఇలా జగన్ ఆడిపోసుకుంటున్నారు. సొంత బాబాయిని హత్య చేసిన కేసును ఇంతవరకూ తేల్చని జగన్ తీరు ఏ యిజం అన్నది జనసేన విమర్శలు గుప్పిస్తోంది. ఈ వైఎస్ వివేకా కేసు సీబీఐకి అప్పగిస్తే సీబీఐపైనే కేసులు పెట్టిన వైసీపీ నాయకులు రౌడీలు కారా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు బూతులు తిడుతూ మాట్లాడుతుంటే వారు రౌడీలు కాదా.? మంత్రులే పోలీస్ స్టేషన్లలో నిరసనకారులను కొట్టిస్తూ ఉంటే వారు రౌడీలు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రౌడీలకు కొత్త నిర్వచనాన్ని జగన్ ఈరోజు తీసుకొచ్చాడు. గొంతెత్తితే రౌడీ షీట్ తెరుస్తామన్నా.. జనసేన ప్రజల కోసం గొంతెత్తుతోంది. నిరసనలు ఆపడం లేదు. అందుకే జనసేనను రౌడీసేన అంటున్నాడు జగన్. కానీ రౌడీలకే రౌడీల సేన.. దమ్మున్న సేన. ధైర్యమున్న సేన. ప్రజలకు అండగా నిలిచే సేన అని చెప్పక తప్పదు. జనసేన బలపడేకొద్దీ సహనం కోల్పోతున్న జగన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
