Chandrababu Naidu Manifesto : జగన్ బాటలో చంద్రబాబు, ఇద్దరూ ఆంధ్రాకి ద్రోహం
Chandrababu Naidu Manifesto : మహానాడులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవన్నీ అమలు చేయాలంటే జగన్ చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతున్నాయి. అయితే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే జగన్ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు, బీహార్ లో ఎన్నికల హామీలను కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మేనిఫెస్టోగా రూపొందించారు. జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా […]

Chandrababu Naidu Manifesto : మహానాడులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవన్నీ అమలు చేయాలంటే జగన్ చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతున్నాయి. అయితే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే జగన్ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు, బీహార్ లో ఎన్నికల హామీలను కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మేనిఫెస్టోగా రూపొందించారు.
జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఓట్లు రావడం మాట దేవుడెరుగు.. టీడీపీ వైపు ఉన్న స్ట్రాంగ్ ఓటరు చేజారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. జగన్ ట్రాపులో చంద్రబాబు పడ్డారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేనిఫెస్టో టీడీపీకి గుదిబండగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంక్షేమానికి ఆధ్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. దానిని కొనసాగిస్తున్నట్టు జగన్ చెబుతున్నారు. కానీ తండ్రిలా కాకుండా ఉచితాలు ప్రకటించి అభివృద్ధిని నిర్వీర్యం చేశారన్న అపవాదు జగన్ పై ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ తరుణంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొంత ఉపశమనం వుంటుందని కొన్ని వర్గాలు భావిస్తూ వచ్చాయి. వీళ్లంతా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు.
అయితే టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్‌ను వ్యతిరేకిస్తున్న, అలాగే చంద్రబాబు వస్తే అద్భుతం ఏదో చేస్తారని ఆశించిన వాళ్లందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ ఒక్క చేత్తో బటన్ నొక్కి సంక్షేమ లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తున్నారని, ఇక చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తే రెండు చేతులూ సరిపోవనే విమర్శ మొదలైంది.
జగన్ బాటలో చంద్రబాబు, ఇద్దరూ ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు.. చంద్రబాబు మేనిఫెస్టోపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
