Analysis On BBC Defends PM Modi Documentary : బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్… స్థూలంగా బీబీసీ… దీని పని వార్తలు ప్రసారం చేయడం… ఎప్పుడో 1921లో ప్రారంభమైన ఈ సంస్థ… వార్తల ప్రసారం కంటే… తేనె తుట్టెలను కదపడం మీదే ఆసక్తి ఎక్కువ. ఒక బ్రిటిష్ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉన్న వివాదాస్పద అంశాలను గెలుక్కోవడం ఈ సంస్థకు వెన్నతో పెట్టిన విద్య.. అందుకే కొన్ని ఇస్లామిక్ దేశాలు దీనిని నిషేధించాయి.. అయినా కూడా దాని ధోరణి మారలేదు. మారదు కూడా.. ఇక భారత్ విషయంలో బీబీసీ ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటుంది. కోవిడ్ సమయంలో ఈ సంస్థ ఎంతటి భయానకమైన వార్తలు ప్రసారం చేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోరు.. తాజాగా ఈ సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టన్నుల కొద్దీ విషం కక్కింది. దీంతో బీబీసీ పై నిరసన వ్యక్తం అవుతున్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ సిరీస్ ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీలో ఎటువంటి విశ్వసనీయత లేదు.. బ్రిటన్ లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలో వలసవాదం మనస్తత్వం, ఆలోచన ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మోడీపై ఈ డాక్యుమెంటరీని బీబీసీ రెండు భాగాలుగా ప్రచారం చేసింది. 2002 లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల సమయంలో ఆ రాష్ట్రానికి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది. కొన్ని ప్లాట్ ఫామ్ ల నుంచి దీనిని తొలగించారు కూడా. భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమీ రేంజర్ బీబీసీ తీరు పై తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. డాక్యుమెంటరీ 100 కోట్ల ప్రజల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మోడీ పై BBC డాక్యుమెంటరీ ఎందుకు వివాదమయ్యింది? దానివెనుక అసలు కారణాలేంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో తెలుసుకుందాం.