
Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు చిత్రాలు లైన్లో పెట్టారు. మరో చిత్ర షూటింగ్ సైతం స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఒప్పుకున్న సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూనే షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. హరి హర వీరమల్లు సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల వినోదయ సితం రీమేక్ సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సైతం లైన్లో పెట్టారు.
కాగా హరి హర వీరమల్లు మూవీ కంటే కూడా ముందు వినోదయ సితం రీమేక్ థియేటర్స్ లోకి రానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో వినోదయ సితం మూవీ చేస్తున్నారు. సాయి ధరమ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు కేటాయించారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో వినోదయ సితం రీమేక్ షూటింగ్ జరుగుతుంది. సముద్ర ఖని దర్శకుడిగా ఉన్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రిప్ట్ సమకూర్చారు.

Pawan Kalyan
సముద్ర ఖని రాసిన మూల కథ మాత్రమే తీసుకుని పవన్ ఇమేజ్ కి తగ్గట్లు భారీ మార్పులు చేశారట. ఇక వినోదయ సితం రీమేక్ లో పవన్ కళ్యాణ్ దైవంగా కనిపించనున్నారు. ఒక సామాన్యుడికి దేవుడితో సాగే జర్నీ సెటైరికల్ అండ్ సోషల్ మెసేజ్ గా చెప్పే ప్రయత్నం అని సమాచారం. కాగా ఉగాది కానుకగా వినోదయ సితం నుండి ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ సిద్ధం అవుతుందట. ఈ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు యూనిట్ నిర్ణయం తీసుకున్నారట.
ఆల్రెడీ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. వినోదయ సితం మూవీలో పవన్ కళ్యాణ్ భగవంతుడి పాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో దేవుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. మొదట దేవర లేదా భగవంతుడు టైటిల్స్ అనుకున్నారట. ఫైనల్ గా యూనిట్ దేవుడు టైటిల్ కే ఓటేశారట. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక రానున్న ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ నుండి ఒకటి మూడు సినిమాలు విడుదల కానున్నాయి.