Rajasthan Groom: అర్థరాత్రి వరకూ ఆ పనిచేసిన వరుడు.. ఆ నైట్ వధువు ఏం చేసిందో తెలుసా?
రాజస్థాన్ లోని చరులోఓలో ఓ వివాహం నిర్ణయించారు. ముహూర్తం దగ్గర పడటంతో పెళ్లికొడుకు ఊరేగింపుగా మండపానికి బయలుదేరాడు. కానీ ఎంతకీ రాలేదు. దీంతో వధువు చాలా సేపు వేచి చూసినా వరుడు ఇంకా రాకపోయే సరికి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో అక్కడకు పెళ్లికి వచ్చిన ఓ యువకుడితో తాళి కట్టించుకుంది. ఇంకేముంది పెళ్లి కొడుకు బకరా అయిపోయాడు.

Rajasthan Groom: జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి. దీంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావిస్తారు. సంప్రదాయ బద్ధంగా ఆటపాటలతో హోరెత్తిస్తారు. డ్యాన్సులతో ఆకట్టుకుంటారు. ఇక్కడో ట్విస్ట్ ఏర్పడింది. పెళ్లి కుమారుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకోవడానికి ఆలస్యం చేయడంతో అక్కసుతో పెళ్లి కూతురు మరొకరిని వివాహమాడి అతడికి చుక్కలు చూపించింది.
రాజస్థాన్ లోని చరులోఓలో ఓ వివాహం నిర్ణయించారు. ముహూర్తం దగ్గర పడటంతో పెళ్లికొడుకు ఊరేగింపుగా మండపానికి బయలుదేరాడు. కానీ ఎంతకీ రాలేదు. దీంతో వధువు చాలా సేపు వేచి చూసినా వరుడు ఇంకా రాకపోయే సరికి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో అక్కడకు పెళ్లికి వచ్చిన ఓ యువకుడితో తాళి కట్టించుకుంది. ఇంకేముంది పెళ్లి కొడుకు బకరా అయిపోయాడు.
తీరా మండపానికి వచ్చే సరికి పెళ్లి అయిపోయింది. దీంతో ఏం చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయాడు. పెళ్లి సమయానికి రాకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఊరేగింపుగా వచ్చే పెళ్లికొడుకు మండపానికి చేరుకునే సరికి తెల్లవారు జామున రెండు గంటలయింది. దీంతో ఎదురు చూసిన పెళ్లికూతురు చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. దేనికైనా ఓ హద్దుంటుంది. నాకోసం ఎదురు చూస్తుందనే నిర్లక్ష్యంతోనే వరుడు ఇలాచేస్తే అతడికి సరైన సమాధానం చెప్పింది పెళ్లికూతురు.
మొత్తానికి వరుడు కూడా ఆహుతుడు అయిపోయాడు. తన పెళ్లికితానే ఓ బంధువుగా హాజరయినట్లు అయింది. సహనానికి కూడా హద్దుంటుంది. సమయం మించిపోయేసరికి ఆమెకు కోపం వచ్చింది. పెళ్లికొడుకునే మార్చేసింది. నోముకున్నోడి బూరె నోచుకున్నోడు తిన్నట్లు పెళ్లి జరిగే వాడికేమో పరాభవం. పెళ్లి కొచ్చిన వాడికేమో సంతోషం. ట్విస్టంటే ఇదే.