Taraka Ratna Wife Alekhya Reddy: అలేఖ్య రెండో పెళ్లిపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు..

తారకరత్న గత 2023 ఫిబ్రవరి 17న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన కటుుంబ సభ్యులు తారకరత్నను ఏదో విషయంలో తలుచుకుంటూనే ఉంటున్నారు. ఇక ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి నిత్యం తారకరత్న గురించి ఆలోచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు.

  • Written By: Vicky
  • Published On:
Taraka Ratna Wife Alekhya Reddy: అలేఖ్య రెండో పెళ్లిపై క్లారిటీ  ఇస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు..

Taraka Ratna Wife Alekhya Reddy: నందమూరి కుటుంబలో చోటు చేసుకున్న విషాదాలు ఆ కుటుంబ సభ్యులను ఇప్పటికీ కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాయి. ఈ కుటుంబంలో ఒక్కొక్కరు అకాల మరణం చెందుతుండడం తీవ్ర బాధను కలిగిస్తోంది. రీజెంట్ గా హీరో, రాజకీయ నేత తారకరత్న మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన మరణం తరువాత ఆయన గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుటంబాన్ని కాదని అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్న తరువాత జరిగిన పరిణామాల గురించి ఆమె సందర్భానుసారం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లేటేస్టుగా ఆమె ఓ సంచలన పోస్టు పెట్టారు.

తారకరత్న గత 2023 ఫిబ్రవరి 17న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన కటుుంబ సభ్యులు తారకరత్నను ఏదో విషయంలో తలుచుకుంటూనే ఉంటున్నారు. ఇక ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి నిత్యం తారకరత్న గురించి ఆలోచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. తనను గుర్తు చేసుకుంటూ పలు విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. అయితే లేటేస్టుగా ఆమె గురించి కొందరు పోస్టులు పెట్టారు.

తారకరత్న చనిపోయి మూడు నెలలు కాకముందే అలేఖ్య రెడ్డి రెండో పెళ్లి చేసుకుంటున్నారని కొందరు అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టడంపై తీవ్ర చర్చ సాగింది. మరోవైపు నిజంగానే అలేఖ్య రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని చాలా మంది అనుకున్నారు. ఒకవేళ రెండో పెళ్లికి సిద్ధమైనా ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారా? అని చర్చలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై అలేఖ్య రెడ్డి రియాక్టయ్యారు.

తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ‘నా తుదిశ్వాస విడిచే వరకు నేను నీ భార్యనే.. నా జీవితానికి నువ్వు చాలు..’అని ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు. దీంతో ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే నందమూరి ఫ్యాన్స్ ఎవరో ఆకతాయిలు ఇలాంటి వార్తలు పెట్టారని, వీటిని పట్టంచుకోవద్దని పోస్టులు పెడుతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు