Mamata Banerjee : ఇదే మమతా నినాదం
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కేంద్రం చేతుల్లో ఉంటాయి. అదే పంచాయితీ ఎన్నికలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. దీంతో మమతా బెనర్జీ ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది. హైకోర్టు దఫాల వారీగా ఎన్నికలు పెట్టాలని చెప్పినా కూడా మమత వినకుండా తనకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించి హింస చెలరేగేలా చేసి గెలిచేసింది..

Mamata Banerjee : బెంగాల్.. భారత స్వాతంత్ర్య ఉద్యమంతో ఉప్పొంగిన నేల.. రవీంద్రనాత్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్.. ఆ పేర్లు తలుచుకుంటేనే మనకు గగుర్పాటు కలుగుతుంది. ఇప్పుడు అలాంటి నేల ఇప్పుడు ఓ ఉన్మాది చేతిలోకి వెళ్లిపోయింది.
బెంగాల్ లో ఇప్పుడు మమత అనుకున్నదే రాజ్యం.. ఆమె చేసిందే చట్టం.. ఎదురొస్తే ఎంతటి వారైనా మసి మాడి అవ్వాల్సిందే. ఒకనాడు ఇది సీపీఎం పరిపాలనలో అనైతికంగా ఉంటే మమతా బెనర్జీనే వాళ్లకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది. అధికారం కోసం హింసను ప్రేరేపించి గెలిచింది. రెండోసారి బీజేపీపై ఎగదోసి విజయఢంకా మోగించింది.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కేంద్రం చేతుల్లో ఉంటాయి. అదే పంచాయితీ ఎన్నికలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. దీంతో మమతా బెనర్జీ ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది. హైకోర్టు దఫాల వారీగా ఎన్నికలు పెట్టాలని చెప్పినా కూడా మమత వినకుండా తనకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించి హింస చెలరేగేలా చేసి గెలిచేసింది..
జనం చనిపోయినా పర్వాలేదు, అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఇదే మమతా నినాదం’.. బెంగాల్ పంచాయితీ ఎన్నికల తీరుపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.