WhatsApp: వాట్సాప్ లో చాట్ చేయాలంటే నెంబర్ ఇవ్వనక్కర్లేదు..
ఇప్పటివరకు ఇతరులతో వాట్సాప్ ద్వారా చాట్ చేయాలనుకుంటే నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అవసరం అనుకుంటే మన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నెంబర్ అవసరం లేకుండా ఇతరులతో చాట్ చేసే వీలుగా ఆప్షన్ ను తీసుకొస్తుంది.

WhatsApp: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. స్కూల్ కి వెళ్ళే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ దీని ద్వారా మెసేజ్ చేసుకుంటారు. ఒక్క రోజులో వాట్సాప్ పని చేయకపోతే వ్యవస్థ మొత్తం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదాలను ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా మరో అప్డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు ఇతరులతో వాట్సాప్ ద్వారా చాట్ చేయాలనుకుంటే నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అవసరం అనుకుంటే మన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నెంబర్ అవసరం లేకుండా ఇతరులతో చాట్ చేసే వీలుగా ఆప్షన్ ను తీసుకొస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ లోని ఎదుటి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వాళ్లకు సంబంధించిన డీపీ పిక్, ఫోన్ నెంబర్ లాంటివి కనిపిస్తాయి. కానీ ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం కోడ్ ద్వారా కూడా ఇతరులతో చాట్ చేయొచ్చు.అయితే ఆ యూజర్ నేమ్ ను మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎవరికైనా మెసేజ్ చేయవచ్చు.. చాటింగ్ చేసుకోవచ్చు..
ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్ టెలిగ్రామ్ యాప్ లో ఉండేది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తేవడానికి ఈ యాప్ యాజమాన్యం బేటా ప్రయత్నిస్తున్నట్లు వాబిటా ఇన్ఫో అనే వెబ్సైట్ తెలిపింది. అంటే ఎవరైనా కొత్త వ్యక్తులకు మన కాంటాక్ట్ నెంబర్ @ అని సింబల్ తో ఒక కోడ్ను ఇస్తే సరిపోతుంది.
అయితే దీని ఉపయోగాలు అవసరాలు ఏంటనేది ఇప్పటివరకు బెటా సంస్థ వెల్లడించలేదు. కానీ ఇలా చేయడం వల్ల యూజర్స్ గోప్యతకు ఎటువంటి భంగం కలగదని బెటా తెలిపింది.