Amrutha Pranay : హీరో కార్తికేయతో అమృత ప్రణయ్‌.. షాక్ లో ప్రణయ్‌ ఫ్యామిలీ.. నెటిజన్స్

ఈ వీడియోను అమృత స్వంయగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో అమృత సంప్రదాయ చీరలో కుందన బొమ్మను గుర్తుకు తెచ్చేలా మనోహరమైన హావభావాలు పలికించింది.

  • Written By: NARESH
  • Published On:
Amrutha Pranay : హీరో కార్తికేయతో అమృత ప్రణయ్‌.. షాక్ లో ప్రణయ్‌ ఫ్యామిలీ.. నెటిజన్స్

Amrutha Pranay : తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను వెంటాడే జ్ఞాపకం ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మారుతీరావు చేసిన దారుణ హత్య. కులం, ప్రేమ మధ్య ప్రాచీన సమాజపు పునాదులను కదిలించిన హింసాత్మక చర్య. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని సొంత అల్లుడు అని కూడా చూడకుండా.. మారుతీరావు దారుణంగా హత్య చేయించాడు. పరువు హత్యగా పిలవబడే ఈ హేయమైన చర్య అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది, ప్రజల సామూహిక చైతన్యంపై చెరగని ముద్ర వేసింది. దాదాపు ఐదేళ్లు దాటినా తెలుగు ప్రజల గుండెల్లో ఈ చేదు జ్ఞాపకం అలాగే ఉంది. మరోపు మారుతీరావు కూతురు అమృత అప్పటికే గర్భిణి. భర్త చనిపోయినా తాను అత్తవారింట్లోనే ఉంటోంది. పుట్టిన బిడ్డలో భర్తను చూసుకుంటోంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌..
అమృత తన బాధను మర్చిపోవడానికి ఇటీవలే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయింది. వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ అమృత తన జీవితంలో ప్రణయ్‌ తప్ప వేరొకరికి స్థానం లేదని చెబుతోంది. అయితే సోషల్‌ మీడయాలోకి వచ్చిన తర్వాత అమృతకు సెలబ్రిటీలు పరిచయం అయ్యారు. టీవీ యాక్టర్లు, యాంకర్లు ఆమెను సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా అమృత వారిలో కలిసి రీల్స్‌ కూడా చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది.

ఆర్‌ఎక్స్‌ 100 హీరోతో డ్యాన్స్‌..
తాజాగా ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ నటించిన ‘‘బెదురులంక 2012’’ ఆగష్టు 25న తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ఎలా ఉన్నా.. సినిమా ప్రమోషన్‌ కోసం హీరో కార్తికేయ అమృత ప్రణయ్‌తో కలిసి చేసిన వీడియో ఇపుపడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో అమృత, కార్తికేయ సినిమా పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అమృత స్వంయగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో అమృత సంప్రదాయ చీరలో కుందన బొమ్మను గుర్తుకు తెచ్చేలా మనోహరమైన హావభావాలు పలికించింది. మరోవైపు కార్తికేయతో ఆకర్షణీయమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

అభినందిస్తున్న ఫాలోవర్స్‌..
ఈ వీడియోను చూసిన అమృత ఫాలోవర్స్‌ ఆమె నటనను మెచ్చుకుంటున్నారు. కొందరు ఆమె మరియు కార్తికేయ మధ్య ఉద్వేగభరితమైన ముద్దు ఉందని కూడా సూచించారు. ముఖ్యంగా, బిగ్‌ బాస్‌ సంచలనం శివజ్యోతి అమృత ప్రణయ్‌ ప్రతిభను ఫైర్‌ మరియు హార్ట్‌ ఎమోజీల ద్వారా ప్రశంసించారు. అమృత తన వ్యక్తిగత జీవితంలో బాధాకరమైన నష్టాన్ని చవిచూసిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆమె ప్రయాణం తీవ్ర మలుపు తిరిగింది.

ఫ్యాషన్‌పై దృష్టి..
అమృత ఇటీవల ఫ్యాషన్‌పై కూడా దృష్టిపెట్టింది. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుకుంటుందో లేదో అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఆమె ఇటీవలి వీడియో ఆమె త్వరలో నటిగా వెండితెరను అలంకరించగలదనే ఊహాగానాలకు దారితీసింది. అయితే ప్రణయ్‌ కుటుంబం మాత్రం అమృత వీడియో గురించి ఏమనుకుంటుందో తెలియలేదు.

 

View this post on Instagram

 

A post shared by Amrutha ️ (@amruthapranay)

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు