Ambati Rayudu: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశాడు. తాను ఇక ఐపీఎల్ లో ఆడటం లేదని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అంబటిని రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. దాని విజయాల్లో కూడా అతడు కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇది నాచివరి ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పడంతో అంబటి 13 సంవత్సరాల కెరీర్ కు టాటా చెప్పనున్నట్లు తెలుస్తోంది. అతడి అద్భుతమైన ప్రతిభతో తన ప్రయాణం కొనసాగించాడు.

Ambati Rayudu
ఐపీఎల్ లో ఇప్పటివరకు 187 మ్యాచులాడిన రాయుడు 4,187 పరుగులు చేశాడు. యావరేజ్ 30. ఇందులో ఒక సెంచరీతోపాటు 22 అర్థ శతకాలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ లో ఎంపికైనా వివాదాల కారణంగా అతడిని తొలగింినట్లు తెలిసిందే. దీంతో రాయుడుకు బదులు విజయ్ శంకర్ ను తీసుకోవడం వివాదానికి కారణమైంది.
Also Read: TTD JEO Dharma Reddy:టీటీడీ జేఈవో ధర్మారెడ్డి కోసం వైసీపీ సర్కారు ఆరాటం.. అందాకా వెళ్లిందా?
రాయుడు 2022 సీజన్ లో 12 మ్యాచులాడి 27.10 సగటుతో 271 పరుగులు చేశాడు. రాయుడు తన కెరీర్ లో ఎన్నో మ్యాచులు గెలిపించినాడు. కానీ తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తరువాత కాసేపటికి దాన్ని ట్విటర్ నుంచి తొలగించాడు. దీంతో అంబటి రాయుడు నిజంగా అన్నాడా? లేక ఏదో తమాషా చేశాడా అనేది తేలాల్సి ఉంది.

Rayudu
ఇప్పటికే ఐపీఎల్ సీజన్ నుంచి ప్లే ఆప్స్ రేసు నుంచి చెన్నై నిష్ర్కమించినట్లు తెలిసిందే. ఈ దశలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడనుంది. తన కెరీర్ లో ఈ సీజన్ ఎంతో ముఖ్యమని ప్రకటించిన రాయుడు తాను ఇక ఆడనని చెప్పడం గమనార్హం. అంబటి రాయుడు ప్రకటన వెనుక కారణం ఏముంటుందనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. అసలు రాయుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదని కామెంట్లు వస్తున్నాయి.
Also Read: Vijayanagaram District: ఆ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తున్న నేతలు.. ఎందుకలా?