Smart TV: రూ.311కే అమ్ముతున్న ఈ స్మార్ట్ టీవీ గురించి తెలుసా?
వెస్టింగ్ హౌస్ అనే ఓ కంపెనీ ఓ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 24 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ ధర రూ.10,999. అయితే ఈ కంపెనీ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

Smart TV: నిత్యావసరాల్లో టీవీ ఒక భాగం. ఒకప్పుడు టెలివిజన్ గ్రామం మొత్త కలిపి ఒకే ఇంట్లో ఉండేది. దీనిని అప్పట్లో ధనవంతులు మాత్రమే కొనుగులు చేసేవారు. ఇందులో దూరదర్శన్ తప్ప ఇంకేమి ప్రసారం అయ్యేవి కావు. కానీ ఇప్పుడు టెలివిజన్ లేని గుడిసె లేదు. థియేటర్లో రిలీజైన సినిమాలు కొన్నిరోజులకే టీవీల్లో రావడంతో పాటు పలు ప్రొగ్రామ్స్ అలరిస్తుండడంతో టీవీలపై ఇంకా మక్కువ తగ్గడం లేదు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. హై టెక్నాలజీతో కూడుకున్న టీవీ సైతం తక్కువధరకే విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో ఓ కంపెనీ టీవీ కేవలం రూ.300 చెల్లించి టీవీని తీసుకెళ్లండి.. అనే బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
వెస్టింగ్ హౌస్ అనే ఓ కంపెనీ ఓ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 24 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ ధర రూ.10,999. అయితే ఈ కంపెనీ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రూ.11 వేల టీవీని కేవలం రూ.6,499కు అందిస్తోంది. అంటే ఈ టీవీపై 41 శాతం డిస్కౌంట్ అందిస్తుందన్నమాట. అయితే మీరు ఇంత కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు లేదా మీ బంధువుల వద్ద క్రెడిట్ కార్డు ఉంటే.. ఆ కార్టు ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. అలా చేస్తే రూ.1500 వరకు తగ్గింపు ఉంటుంది. అంటే అప్పుడు రూ.5000లకే దీనిని సొంతం చేసుకోవచ్చు.
400 నిట్స్ బ్రైట్ నెస్, ఇన్ బిల్ట్ వైఫై, 2 హెచ్ డీఎంఐ పోర్టులు, 20 వాట్ స్పీకర్లు, 2 యూఎస్ బీ పోర్టులు, ఎంలాజిక్ క్వాడ్ కోర్ ప్రొపెసర్, మీరా కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇవి ఆఫ్ లైన్లో మార్కెట్లోకి ఇంకా రాలేదు. అందువల్ల దీనిని అన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి వస్తుంది. అయితే టీవీ ఫీచర్స్ గురించి బాగా తెలుసుకొని బుక్ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఇక ఇందులో అమెజాన్, జీ 5, సోని లివ్ లాంటి వాటిని సబ్ స్క్రిప్షన్ చేసుకునే అవకాశం ఉంది.
అయితే రూ.5 వేలకు వచ్చే ఈ స్మార్ట్ టీవీని ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 24 నెలలకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.311 చెల్లించాలి. 12 నెలలకు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కేవలం 9 నెలల్లోనే పూర్తి చేయాలనుకుంటే నెలకు రూ.771 పడుతుందని చెబుతున్నారు. అయితే మీరు ఈఎంఐ ద్వారా టీవీని కొనుగోలు చేయాలనుకుంటే కేవలం రూ.311 చెల్లించి టీవీని సొంతం చేసుకోవచ్చు.