Acidity: ఎసిడిటీ సమస్యతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే?

Acidity: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి. ఇష్టానుసారం భోజనం చేయడం నిద్ర సంబంధిత సమస్యలు ఎసిడిటీకి కారణమవుతాయి. ఎసిడిటీతో బాధ పడేవాళ్లు మందులు వాడటం ద్వారా కొన్నిసార్లు సమస్యకు చెక్ పెడితే కొన్నిసార్లు మందులు వాడినా సమస్య తగ్గకపోవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. పుదీనా వాటర్, రోజ్ వాటర్ ను తాగి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసుకోవడం ద్వారా ఎసిడిటీ […]

  • Written By: Navya
  • Published On:
Acidity: ఎసిడిటీ సమస్యతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే?

Acidity: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి. ఇష్టానుసారం భోజనం చేయడం నిద్ర సంబంధిత సమస్యలు ఎసిడిటీకి కారణమవుతాయి. ఎసిడిటీతో బాధ పడేవాళ్లు మందులు వాడటం ద్వారా కొన్నిసార్లు సమస్యకు చెక్ పెడితే కొన్నిసార్లు మందులు వాడినా సమస్య తగ్గకపోవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

Acidity

Acidity

పుదీనా వాటర్, రోజ్ వాటర్ ను తాగి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసుకోవడం ద్వారా ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని పాలలో ఆవునెయ్యి వేసుకుని తాగడం ద్వారా కూడా ఎసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్ర ఉంటే కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read: హీరో పోస్ట్ పై సీరియస్ అయిన సమంత.. నా స్వాగ్ అంతా నాశనం చేశారంటున్న హీరో..

మధ్యాహ్నం షర్బత్ రసం లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సోంపు గింజలు నమలడం, ఎండు ద్రాక్షలను తినడం, నానబెట్టిన కొత్తిమీర వాటర్ తాగడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత నిద్రించే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. సమయానికి భోజనం చేస్తూ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉంటే ఎసిడిటీని అధిగమించవచ్చు.

టీ, కాఫీ, ఆస్పిరిన్, మద్యం, ధూమపానంకు దూరంగా ఉండటం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. క్రమపద్ధతిలో ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: అసలైన ప్రేమ అంటే సిరి-శ్రీహాన్ లదే.. షణ్ముఖ్-దీప్తి సునయన వీరిని చూసి నేర్చుకోవాలా?

Recommended Video:

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు