Amardeep Chaudhary: బిగ్ బాస్ లోకి కొత్తగా పెళ్లైన నటుడు అమర్ దీప్.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ

1990 నవంబర్ 8న అమర్ దీప్ ఏపీలోని అనంతపురం జిల్లాలో జన్మించారు. అమీర్ బాషా, రూపాలు ఆయన తల్లిదండ్రులు. వీరిద్దరు నృత్యకారులే. దీంతో అమర్ దీప్ కూడా డ్యాన్స్ నేర్చుకున్నారు. చదువుకుంటూనే పలు డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు.

  • Written By: SS
  • Published On:
Amardeep Chaudhary: బిగ్ బాస్ లోకి  కొత్తగా పెళ్లైన నటుడు అమర్ దీప్.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ

Amardeep Chaudhary: బిగ్ బాస్ సీజన్ 7 స్ట్రాట్ అయింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి రకరకాల చర్చలు సాగుతున్నాయి. బిగ్ బాస్ ఈవెంట్ సందర్భంగా కంటెస్టెంట్లు తమ బ్యాగ్రౌండ్ చెప్పినా వారి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి బాగా వెతుకుతున్నారు. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన అమర్ దీప్ తో కొన్ని సినిమాల్లో కూడా నటించారు. తోటి నటి తేజస్విని గౌడతో ప్రేమలో పడ్డ ఆయన ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి కావడంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం రావడంతో ఆయన గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. అమర్ దీప్ వివరాల్లోకి వెళితే..

1990 నవంబర్ 8న అమర్ దీప్ ఏపీలోని అనంతపురం జిల్లాలో జన్మించారు. అమీర్ బాషా, రూపాలు ఆయన తల్లిదండ్రులు. వీరిద్దరు నృత్యకారులే. దీంతో అమర్ దీప్ కూడా డ్యాన్స్ నేర్చుకున్నారు. చదువుకుంటూనే పలు డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే బిటెక్ పూర్తయిన తరువాత మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత సినీ ఫీల్డులోకి ఎంట్రీపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 2016లో ‘పరిణయం’ అనే షార్ట్ ఫిలింలో నటించాడు.

ఇది వర్కౌట్ కాకపోవడంతో కేరళలోని త్రివేండ్రంలోని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత హైదరాబాద్ కు మకాం మార్చి ‘ఐ డ్రీమ్’ లో చేరారు. పిజ్జా వర్కెస్ గొంగూర, మంగమ్మ గారి మనువడు, రాజుగారి కిడ్నాప్, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే.. వంటి షార్ట్ ఫిలింస్ లో నటించాడు. దీంతో ఆయన ఫేమస్ అయ్యాక సీరియల్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. అలా మొదటిసారిగా 2017లో ‘ఉయ్యాల జంపాలా’ అనే సీరియల్ లో నటించారు. ఇందులో రాహుల్ అనే పాత్రతో అమర్ దీప్ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత 2019లో ‘సిరిసి మువ్వలు’ అనే సీరియల్ లో నటంచే అవకాశం వచ్చంది.

ఆ తరువాత అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియళ్లతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అమర్ దీప్ సీరియళ్లలోనే కాకుండా ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున యుద్దం, శైలాజా రెడ్డి అల్లు వంటి సినిమాల్లో మెరిశాడు. ఈ క్రమంలో ఆయన తోటి నటి తేజస్విని గౌడతో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరు 2022లో బెంగుళూరులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి ఏడాది కూడా కాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్న అమర్ దీప్ కు సపోర్ట్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు