రాజధాని నుండి మున్సిపాలిటీకి చేరిన అమరావతి ప్రస్థానం..
రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో అమరావతి భవిష్యత్ పై నీలి నీడలు క్రమ్ముకున్న సమయంలో రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి అమరావతి పేరుతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాజధాని స్థాయి నుండి మునిసిపల్ స్థాయికి అమరావతి ప్రాధాన్యతను కుదించిన్నట్లు కానున్నది. ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలన్నీంటిని […]

రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో అమరావతి భవిష్యత్ పై నీలి నీడలు క్రమ్ముకున్న సమయంలో రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి అమరావతి పేరుతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాజధాని స్థాయి నుండి మునిసిపల్ స్థాయికి అమరావతి ప్రాధాన్యతను కుదించిన్నట్లు కానున్నది.
ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలన్నీంటిని కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
గతంలో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినా, జనాభా రీత్యా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. మున్సిపాల్టీగా ఏర్పాటు చేయాలన్న తాజా నిర్ణయంతో పట్టణాభివృద్దిశాఖ ద్వారానే అక్కడ పనులు జరగనున్నాయి.
గతంలో తుళ్లూరు మండలంలో కొన్ని గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మున్సిపాలిటీలో వాటినీ కలపనున్నారు.
ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే చర్చ మొదలైన అనంతరం రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో రాజధాని పరిధిలోకి వచ్చిన తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని గ్రామాలను మాస్టర్‌ప్లాను నుండి విడదీసి కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీల పరిధిలో కలిపేశారు.
దీంతో రాజధాని పరిధి నామమాత్రంగా మారింది. అయితే ఇది తమను మోసం చేయడ మవుతుందని పేర్కొంటూ పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చడానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని ఇటీవల పట్టణాభివృద్ధిశాఖకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.