Urvasivo Rakshasivo Review: నటీటులు:
అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్,
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: రాకేశ్ శశి
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, ఎం. విజయ్
సంగీతం: అచు రాజమణి
సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్

allu sirish
అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన చివరి వారసుడు అల్లు శిరీశ్. ‘గౌరవం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో గ్యాప్ వచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన ప్రేమ యాంగిల్ చిత్రాల్లోనే నటించారు. ఆయన నటించిన ‘కొత్త జంట’ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరపై కనిపించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
రెండు భిన్న ధ్రువాలు కలిగిన వ్యక్తులు ఒకే కంపెనీలో పనిచేస్తారు. వారిలో ఒకరు శ్రీకుమార్ (అల్లు శిరీశ్), మరొకరు సింధూజ(అను ఇమ్మాన్యుయేల్). సింధూజ అమెరికాలో ఉన్నత కుటుంబంలో పెరుగుతుంది. దీంతో ఆమెకు ప్రేమ మీద సరైన అభిప్రాయం ఉండదు. అందుకే తాను జీవితంలో ఎవరినీ ప్రేమించాలనుకోదు. అయితే లివింగ్ రిలేషన్ షిప్ కు మాత్రం సై అంటుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరు ఒకే కంపెనీలో కలుసుకుంటారు. అయితే సింధూజ తనతో సన్నిహితంగా ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. కానీ శ్రీకుమార్ ను సింధూజ స్నేహితుడిగానే భావిస్తుంది. అయితే సింధూజ తనతో లివింగ్ రిలేషన్ జీవితాన్ని గడపాలంటుంది. ఆమె ప్రేమను పొందడానికి ఒప్పుకుంటాడు. కానీ ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటిని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఊర్వశివో రాక్షసివో కథ ఫస్టాఫ్ చాలా వేగంగా సాగుతుంది. ఇది మొత్తం కామెడీతో ఉంటుంది. దీంతో ప్రేక్షకులు సినిమాలో నిమగ్నమైపోతారు. మధ్య మధ్యలో హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని రొమాన్స్ సీన్స్ ఉంచారు. గతంలో మగవారు బాధ్యతారాహిత్యంగా ఉండేవారు. ఫలితంగా ఆడవాళ్లు నష్టపోయారు. ఇప్పుడు మొగవాళ్లు బాధ్యతారహిత్యంగా ఉంటూ.. తప్పుడు దారిలో వెళ్లే ఆడవారిని మారుస్తారు.. అన్న కాన్సెప్టుతో సినిమా సాగుతుంది. విభిన్న కథతో సినిమా సాగుతుండడంతో ప్రేక్షకులు ఆసక్తికరంగానే చూస్తారు.

allu sirish
ఎవరెలా చేశారంటే?
అల్లు శిరీశ్ రాముడు మంచి బాలుడిలా పోషించి ఆకట్టుకున్నాడు. మిగతా సినిమాలో కంటే ఇందులో పరిణితి పొందాడని కనిపిస్తుంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ ఎప్పటిలాగే అందచందాలను ఆరబోసి యూత్ ను ఆకర్షిస్తుంది. ఫాస్ట్ జనరేషన్ అమ్మాయిగా నటించి మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్, సునీల్ కామెడీ ఆకట్టుకుంటాయి.
సాంకేతిక వర్గం ఎలా పనిచేసిందంటే.?
డైరెక్టర్ రాకేశ్ ప్రేక్షకులకు కొత్త కథను పరిచయం చేశాడు. సినిమాలో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అయినా కామెడీతో కవరవుతుంది. సినిమా స్క్రీన్ ప్లే ఎక్కడా మిస్సవకుండా నడిపించారు. తన్వీర్ సినిమాటో గ్రఫీ బాగుంది. అచ్చు రాజమణి మంచి సంగీతాన్ని ఇవ్వడంతో పాటు ఆమె పాడిన కొన్ని పాటు ఆకట్టుకుంటాయి.
మొత్తంగా కామెడీ సినిమాల కోసం ఎదురుచూసేవారికి ఈ సినిమా ఉపయోగపడవచ్చు. కొన్ని సీన్స్ స్లోగా మూవ్ అయినా రొమాన్స్ కథతో సందడి చేస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ
కామెడీ
ఆకట్టుకునే నటన
మైనస్ పాయింట్స్:
కథ స్లోగా మూవ్ కావడం
పేవలమైన సంగీతం
రేటింగ్: 2.75/5