
Allu Arjun Wife Sneha Reddy
Allu Arjun Wife Sneha Reddy: అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియోలో స్నేహారెడ్డి మిడ్డీ ధరించారు. షార్ట్ మిడ్డీలో స్నేహారెడ్డి స్టార్ హీరోయిన్స్ మాదిరి హాట్ గా తయారయ్యారు. స్నేహారెడ్డి మిర్రర్ సెల్ఫీలతో కూడిన వీడియో పోస్ట్ చేశారు. ట్రెండీ వేర్స్ ధరించిన స్నేహారెడ్డి మనసులు దోచేశారు. స్నేహారెడ్డి గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కొందరైతే స్నేహారెడ్డి నుండి ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంస్టాగ్రామ్ లో స్నేహారెడ్డి తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 9 మిలియన్ ఆమెను ఫాలో అవుతున్నారు. స్నేహారెడ్డి గ్లామరస్ వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. తన డైలీ లైఫ్, ఇష్టాలు, దిన చర్య తెలియజేస్తూ పోస్ట్స్ పెడుతుంటారు. ఇటీవల తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేశారు. యోగ, వ్యాయామం, మంచి ఆహారం, మొక్కలు, కుటుంబంతో గడపడం తన అందం, ఆరోగ్య రహస్యమని వెల్లడించారు.
స్నేహారెడ్డి-అల్లు అర్జున్ 2011లో వివాహం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి కూతురైన స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హలు సంతానం. అమ్మాయి అర్హ అప్పుడే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. శాకుంతలం చిత్రంలో అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun Wife Sneha Reddy
ఇక భార్య ఇష్టాయిష్టాలను గౌరవించే అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. అల్లు స్నేహారెడ్డి అందం చూసిన జనాలు పాన్ ఇండియా స్టార్ వైఫ్ ఆ మాత్రం ఉండాలని అంటున్నారు. స్నేహారెడ్డి మామగారు అల్లు అరవింద్ ఆడపిల్లలు వంట ఇంటికి పరిమితం కాకూడదు అంటారు. వారు తమకు నచ్చిన రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని అంటారు. ఇప్పటికే అల్లు స్నేహారెడ్డి ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగారు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram