Allu Arjun- Ram Charan Daughter: రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ విలువైన గిఫ్ట్… మురిసిపోయిన ఉపాసన!
క్లినిక్ కార పేరు, పుట్టినతేదీ వివరాలు బంగారు అక్షరాలతో రాసిన పలకను బహోకరించారట. అల్లు అర్జున్ ఇచ్చిన ఈ గిఫ్ట్ రామ్ చరణ్, ఉపాసనలకు ఎంతగానో నచ్చేసిందట. సదరు గిఫ్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారట.

Allu Arjun- Ram Charan Daughter: రామ్ చరణ్-ఉపాసన పదేళ్ల నిరీక్షణ అనంతరం పేరెంట్స్ అయ్యారు. ఈ అరుదైన క్షణాలను మెగా ఫ్యామిలీ ఆస్వాదించారు. రామ్ చరణ్ కూతురు రాకను గొప్పగా జరుపుకున్నారు. జూన్ 20వ తేదీన అపోలో హాస్పిటల్స్ లో పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. జూన్ 30వ తేదీన పాపకు బారసాల జరిపారు. క్లిన్ కార అనే పేరు పెట్టారు. తాతయ్య చిరంజీవి స్వయంగా మనవరాలు పేరును ప్రకటించారు. క్లిన్ కార కోసం ఉపాసన గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. నర్సరీ అనే ఈ గదికి పేరు పెట్టారు.
ఫారెస్ట్ థీమ్ తో గోడల మీద జంతువులు, మొక్కలు బొమ్మలతో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ గదిని ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ రూపొందించింది. కాగా రామ్ చరణ్ కూతురికి విలువైన బహుమతులు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కి ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడు కాగా బంగారు డాలర్స్ క్లిన్ కారకు బహుమతిగా ఇచ్చాడని కథనాలు వెలువడ్డాయి. తాజాగా అల్లు అర్జున్ విలువైన స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది.
క్లినిక్ కార పేరు, పుట్టినతేదీ వివరాలు బంగారు అక్షరాలతో రాసిన పలకను బహోకరించారట. అల్లు అర్జున్ ఇచ్చిన ఈ గిఫ్ట్ రామ్ చరణ్, ఉపాసనలకు ఎంతగానో నచ్చేసిందట. సదరు గిఫ్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే బారసాల రోజున ముఖేష్ అంబానీ దంపతులు బంగారు ఊయల బహుమతిగా ఇచ్చారంటూ ప్రచారం జరిగింది.
ఇక క్లిన్ కార అనే పేరు లలితా సహస్రనామం నుండి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో క్లిన్ కార జన్మించింది. అద్భుత ఘడియల్లో క్లిన్ కార జన్మించగా… ఆమెది గొప్ప జాతకమని పండితులు తేల్చారు. కీర్తిలో తల్లిదండ్రులను మించి పోతుంది. గొప్ప పేరు తెచ్చుకుంటుందని వెల్లడించారు. ఇక క్లిన్ కార కడుపున పడటంతోనే తమ కుటుంబంలో అనేక శుభాలు చోటు చేసుకున్నట్లు చిరంజీవి స్వయంగా చెప్పడం విశేషం
