Allu Arjun- Prabhas: ప్రభాస్ సినిమాతో అల్లు అర్జున్ కొత్త థియేటర్ ఓపెనింగ్..ముఖ్య అతిధి ఎవరంటే!

అత్యాధునిక టెక్నాలిజీ తో ఇండియా లో ఇప్పటి వరకు పరిచయం కానీ సరికొత్త స్క్రీన్స్ తో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మించారు. ఇది ప్రారంభం అయ్యాక హైదరాబాద్ లో మరో బ్రాండెడ్ మల్టీప్లెక్స్ గా నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రారంభ మహోత్సవానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

  • Written By: Vicky
  • Published On:
Allu Arjun- Prabhas: ప్రభాస్ సినిమాతో అల్లు అర్జున్ కొత్త థియేటర్ ఓపెనింగ్..ముఖ్య అతిధి ఎవరంటే!

Allu Arjun- Prabhas: టాలీవుడ్ హీరోలు లేటెస్ట్ గా వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టడం చాలా కామన్ అయిపోయింది. నిన్నటి తరం స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఇందులో ఫేమస్. ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాల్లో కూడా దిగ్గజం అని అనిపించుకున్నాడు. నేటి తరం లో మహేష్ బాబు,ప్రభాస్ , రామ్ చరణ్ మరియు విజయ్ దేవరకొండ వంటి హీరోలకు మల్టీప్లెక్సులు మరియు రెస్టారెంట్స్ ఉన్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో మహేష్ బాబు నిర్మించిన AMB సినిమాస్ కి మంచి క్రేజ్ ఉంది.

అత్యాధునిక టెక్నాలజీ తో , అదిరిపోయే క్వాలిటీ స్క్రీనింగ్ మరియు సౌండ్ సిస్టం తో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోనే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా ఏషియన్ మల్టీప్లెక్స్ జతకట్టింది. హైదరాబాద్ లో అమీర్ పేట్ సమీపం లో ఉన్న సత్యం థియేటర్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే.

ఈ థియేటర్ ని పడగొట్టేసి ఆ స్థానం లో ఒక భారీ మల్టీప్లెక్స్ ని నిర్మించారు.ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం లో అల్లు అర్జున్ కూడా పెట్టుబడులు పెట్టాడు. నిర్మాణం పూర్తి అయ్యి చాలా రోజులు అయినా ఈ మల్టీప్లెక్స్ ని జూన్ 16 వ తేదీన విడుదల అవ్వబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభానికి అల్లు అర్జున్ కూడా విచేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించబోతున్నాడు.

అత్యాధునిక టెక్నాలిజీ తో ఇండియా లో ఇప్పటి వరకు పరిచయం కానీ సరికొత్త స్క్రీన్స్ తో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మించారు. ఇది ప్రారంభం అయ్యాక హైదరాబాద్ లో మరో బ్రాండెడ్ మల్టీప్లెక్స్ గా నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రారంభ మహోత్సవానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు