Allu Arjun: మా నాన్నే నాకు దైవం అన్నీ ఇచ్చింది ఆయనే… అల్లు అర్జున్ కీలక కామెంట్స్
అలాగే తన ఫస్ట్ లవర్ గురించి కూడా ఆయన ఓపెన్ అయ్యారు. కంటెస్టెంట్స్ లో శృతి అనే ఓ అమ్మాయి ఉంది. ఆమె పాడిన ఓ పాట అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది. శృతి అనే పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే అని అల్లు అర్జున్ అన్నారు. పక్కనే ఉన్న జడ్జి గీతా మాధురి ఎప్పుడు ఒకటో క్లాసులోనా అనగా… అందరూ నవ్వేశారు. ఈ కార్యక్రమంలో పుష్ప ఫేమ్ కేశవ కూడా పాల్గొన్నాడు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాకు అన్నీ మా నాన్నే అని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాల మీద స్పందించారు. ఆయన మాట్లాడుతూ… నేను దేవుణ్ణి చూడలేదు. నాకు కనిపించే దైవం అంటే మా నాన్నే. నాకు అన్నీ ఇచ్చిన మా నాన్న నాకు దేవుడు అన్నారు. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
అలాగే తన ఫస్ట్ లవర్ గురించి కూడా ఆయన ఓపెన్ అయ్యారు. కంటెస్టెంట్స్ లో శృతి అనే ఓ అమ్మాయి ఉంది. ఆమె పాడిన ఓ పాట అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది. శృతి అనే పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే అని అల్లు అర్జున్ అన్నారు. పక్కనే ఉన్న జడ్జి గీతా మాధురి ఎప్పుడు ఒకటో క్లాసులోనా అనగా… అందరూ నవ్వేశారు. ఈ కార్యక్రమంలో పుష్ప ఫేమ్ కేశవ కూడా పాల్గొన్నాడు.
పుష్ప కేశవ నటించిన సత్తిగాడు రెండు ఎకరాలు మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ క్రమంలో మూవీని ప్రమోట్ చేసేందుకు వచ్చాడు. సత్తిగాడు రెండు ఎకరాలు చిత్రాలు హీరోగా చేశానని పుష్ప 2 లో చేయనంటావా? అదేం కుదరదు మర్యాదగా పుష్ప 2 సెట్స్ కి వచ్చేయ్, అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలే త్వరలో ప్రసారం కానుంది. గీతామాధురి, థమన్, కార్తీక్, హేమ చంద్ర జడ్జెస్ గా ఉన్నారు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తి చేస్తున్నారు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. 2024 సమ్మర్లో విడుదల ఉంటుందని భావించారు. అయితే 2023 డిసెంబర్ లోనే మూవీ విడుదల చేస్తారట. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.