కన్న తండ్రిని ‘బే’ అంటోన్న అర్హ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఎంజాయ్ చేస్తూ తీసిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.ఎక్కువగా గారాలపట్టి అర్హ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయన తాజా చిత్రం అల వైకుంఠపురములోకి ముందు తన ముద్దుల కూతురు అర్హతో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని బన్నీ అర్హను అడిగితే.. ‘నేను చేసుకోను’ అని […]

  • Written By: Raghava
  • Published On:
కన్న తండ్రిని ‘బే’ అంటోన్న అర్హ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఎంజాయ్ చేస్తూ తీసిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.ఎక్కువగా గారాలపట్టి అర్హ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయన తాజా చిత్రం అల వైకుంఠపురములోకి ముందు తన ముద్దుల కూతురు అర్హతో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని బన్నీ అర్హను అడిగితే.. ‘నేను చేసుకోను’ అని అర్హ ముద్దుగా చెప్పగా దొంగ అంటూ తన కూతురుని చక్కిలిగింతలు పెట్టాడు బన్నీ. అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్ గా అయింది.

ఇప్పుడు తాజాగా తన కూతురుతో మరో వీడియోను చేశాడు బన్నీ.. ‘నీ ఫేవరేట్ కలరేంటి బే’ అని అర్హను బన్నీ అడగగా .. ‘పింక్ బే’ అని బదులిచ్చింది అర్హ. ‘నన్ను బే అంటావా బే’ అంటే ‘అవును బే’ అంటూ అర్హ నోటితో నాలుగు సార్లు ‘బే’ అన్న బూతును పలికేలా చేసాడు బన్నీ. అయితే బన్నీ అభిమానులు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ కొందరు నేటిజన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇప్పటినుంచే బూతులు నేర్పిస్తే పెద్దయ్యాక బూతులే వస్తాయ్ బాలసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక తాజగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించింది .ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు