Allu Arjun Wife Snehareddy : పిచ్చెక్కిస్తున్న అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి వర్క్ అవుట్ వీడియో.. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదా!
Allu Arjun Wife Snehareddy Fitness : ఒక స్టార్ హీరో వైఫ్ కి అదే రేంజ్ పాపులారిటీ ఉంటుంది. భర్తతో కలిసి ఈవెంట్స్ కి వెళ్లాల్సిన ఉంటుంది. సభల్లో మాట్లాడాల్సి ఉంటుంది. మరి పబ్లిక్ లోకి వస్తున్నారంటే… భర్త ఇమేజ్, గ్లామర్ కి మ్యాచ్ అవ్వాలి. అందుకే హీరోల భార్యలు కూడా స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేయాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడాను. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఈ సూక్తిని […]

Allu Arjun Wife Snehareddy Fitness : ఒక స్టార్ హీరో వైఫ్ కి అదే రేంజ్ పాపులారిటీ ఉంటుంది. భర్తతో కలిసి ఈవెంట్స్ కి వెళ్లాల్సిన ఉంటుంది. సభల్లో మాట్లాడాల్సి ఉంటుంది. మరి పబ్లిక్ లోకి వస్తున్నారంటే… భర్త ఇమేజ్, గ్లామర్ కి మ్యాచ్ అవ్వాలి. అందుకే హీరోల భార్యలు కూడా స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేయాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడాను. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఈ సూక్తిని తూచా తప్పకుండా పాటిస్తుంది. స్నేహారెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. ఆమె యంగ్ కాలేజ్ గర్ల్ లా ఉంటారు.
అలా కనిపించడానికి ఆమె చాలానే కష్టపడతారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తారు. ఇష్టమైన పనులు చేస్తూ ఆనందంగా ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఇవే తన బ్యూటీ సీక్రెట్స్ అని స్నేహారెడ్డి వెల్లడించారు. ఇక 2023కి గానూ ఆమె న్యూ ఫిట్నెస్ గోల్స్ పెట్టుకున్నారట. గతంలో తాను పాటించిన పద్ధతులు వదిలేస్తున్నారట. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఫిట్నెస్ గోల్స్ వివరించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఓ రేంజ్ హీరోయిన్స్ కి కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉండరు. అలాగే ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. ట్రెండీ డిజైనర్ వేర్స్ ధరించి మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంటారు. స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.
స్నేహారెడ్డి ఇంత అందగత్తె కాబట్టే అల్లు అర్జున్ పడిపోయారు. వీరిది లవ్ మ్యారేజ్. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి అల్లు అయాన్ , అర్హ పిల్లలు. కూతురు అర్హ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. శాకుంతలం మూవీలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అర్హను సమంత పొగడ్తలతో ముంచెత్తడం విశేషం.
View this post on Instagram