Jagan and Allu Arjun: జగన్ కు అల్లు అర్జున్ ఝలక్
చాలా రోజులుగా రెడ్ బస్ సంస్థకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. కమెడియన్ అలీతో చేసిన యాడ్ బహుళ ప్రాచుర్యం పొందింది. అయితే దీనిని క్యాష్ చేసుకునేందుకు రెడ్ బస్ సరికొత్త ఆలోచన చేసింది.

Jagan and Allu Arjun: ఇటీవల సినిమా తారలు ప్రముఖ కంపెనీ యాడ్లలో నటించి బాగానే వెనుకేసుకుంటున్నారు. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో నజరానా అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే రెడ్ బస్ యాడ్ లో నటిస్తూ ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోటోతో కూడిన ఒక యాడ్ వివాదాస్పదమవుతోంది. దీంతో టీడీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై దుష్ప్రచారానికి దిగుతున్నాయి.
చాలా రోజులుగా రెడ్ బస్ సంస్థకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. కమెడియన్ అలీతో చేసిన యాడ్ బహుళ ప్రాచుర్యం పొందింది. అయితే దీనిని క్యాష్ చేసుకునేందుకు రెడ్ బస్ సరికొత్త ఆలోచన చేసింది. ఆటోలపై రెడ్ బస్ స్టిక్కర్లను భారీగా అతికిస్తోంది. హైదరాబాదులో ఉద్యోగం చేసుకుని.. వీకెండ్ లో విజయవాడ వెళ్లేందుకు రెడ్ బస్ శ్రేయస్కరమని చెప్పడమే ఈ యాడ్ ముఖ్య ఉద్దేశ్యం.
అయితే ఈ యాడ్ ను పొలిటికల్ గాను ఉపయోగించుకోవడం విశేషం. ఏపీలో ఉద్యోగాలు లేవని.. హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని.. ఇది ఏపీ సీఎం జగన్ పనితీరు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఐటీడీపీ విభాగం భారీగా ట్రోల్ చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై ఈ కామెంట్స్ ను జత చేసి.. మిమ్స్ తో ప్రచారాన్ని ఉధృతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతటితో ఆగకుండా అల్లు అర్జున్ జగన్ కు భలే జలక్ ఇచ్చారని.. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని అన్వయించడం వివాదంగా మారుతోంది.
అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ధీటుగా తిప్పి కొడుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలించారని.. అప్పుడు హైదరాబాద్ నుండి ఎంతమందిని తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాదులో ఉన్న వారంతా చంద్రబాబు అభిమానులేనని చెప్పుకుంటున్నారని.. మొన్న ఆయన అరెస్టుతో నిరసన తెలిపింది తమ వారేనని చెప్పుకోవడం మరిచిపోయారా? అంటూ తిప్పి కొడుతున్నారు. హైదరాబాదులో ఉన్న వారంతా ఏపీలోని తమ అనుకూల సామాజిక వర్గం వారేనని.. అక్కడ ఆస్తులు ఉన్నది వారికే నని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వివాదంలో అల్లు అర్జున్ లాగడం పై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
