Allu Arjun: బన్నీ చేయను అనడం మంచిదైంది!
బజాజ్ స్కూటర్ మీద జైలుకు వచ్చి షారుఖ్ ని పట్టుకునే పనిలో పడే తమిళనాడు ఆఫీసర్ పాత్రలో సంజు బాయ్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. నిజానికి ఈ పాత్ర కోసం ముందు తమిళ్ స్టార్ విజయ్ ని, తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యారు అట్లీ.

Allu Arjun: షారుఖ్ ఖాన్ హీరోగా మన సౌత్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 50 కోట్ల పైగా వచ్చాయంటే ఈ సినిమా ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షారుఖ్ నటన కావచ్చు, అట్లీ మేకింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చిన BGM కావచ్చు సినిమాను మరో లెవెల్ కి తీసుకుని వెళ్లాయి.
ఇక ఇందులో క్యామియో రోల్ లో బాలీవుడ్ బాబా సంజయ్ దత్ కనిపించి సందడి చేశాడు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో క్యామియో చేయడం కామన్ అయిపోయింది. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా అంతటి సూపర్ హిట్ కావడానికి అటు మోహన్ లాల్, ఇటు శివరాజ్ కుమార్ చేసిన క్యామియో రోల్స్ బాగా ప్లస్ అయ్యాయి. అయితే జవాన్ లో సంజయ్ చేసిన క్యామియో పెద్దగా క్లిక్ కాలేదనే చెప్పాలి.
బజాజ్ స్కూటర్ మీద జైలుకు వచ్చి షారుఖ్ ని పట్టుకునే పనిలో పడే తమిళనాడు ఆఫీసర్ పాత్రలో సంజు బాయ్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. నిజానికి ఈ పాత్ర కోసం ముందు తమిళ్ స్టార్ విజయ్ ని, తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యారు అట్లీ. వాళ్ళిద్దరి లో ఎవరో ఒకరు ఇందుకు ఒప్పుకుంటే ఒక వేళ స్కెల్ కొంచెం పెరిగేదేమో కానీ ఆ పాత్రకు ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం పెద్దగా మారేది కాదు. ఈ సన్నివేశంలో షారుఖ్ డామినేషన్ ఎక్కువగా ఉంది. బహుశా బన్నీ అందుకే ఎస్ చెప్పలేదు ఏమో ..
ఇక దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ విషయానికి వస్తే గతంలో బన్నీ కి ఒక స్టోరీ లైన్ చెప్పారు అట్లీ. కాకపోతే దానిని హోల్డ్ లో పెట్టిన బన్నీ పుష్ప పనుల్లో మునిగిపోయాడు. ఇప్పుడు పుష్ప 2 కూడా చివరికి వచ్చింది. మరోపక్క జవాన్ రిజల్స్ కళ్లముందు కనిపిస్తుంది. కాబట్టి బన్నీ మరో ఆలోచన లేకుండా అట్లీ తో ముందుకు వెళ్లాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన బన్నీ తన తర్వాతి సినిమా లైనప్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
