Ugram Trailer : అల్లరి నరేష్ మాస్ విశ్వరూపం.. ‘ఉగ్రం’ ట్రైలర్ అదిరిపోయింది

Ugram Trailer : అల్లరి నరేష్ లో ఉన్న కామెడీ టైమింగ్ ని మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము.మధ్య మధ్యలో ఆయన సీరియస్ రోల్స్ తో పాటుగా, కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసేవాడు.అలా ఆయన నటించిన చిత్రాలలో ‘గమ్యం’ చిత్రం ఆయనకీ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.అయితే మళ్ళీ ఆయన రొటీన్ కామెడీ సినిమాలు చెయ్యడం తో మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. ఆ సమయం లో ఆయన తన రూట్ ని మార్చుకొని ‘నాంది’ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Ugram Trailer : అల్లరి నరేష్ మాస్ విశ్వరూపం.. ‘ఉగ్రం’ ట్రైలర్ అదిరిపోయింది

Ugram Trailer : అల్లరి నరేష్ లో ఉన్న కామెడీ టైమింగ్ ని మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము.మధ్య మధ్యలో ఆయన సీరియస్ రోల్స్ తో పాటుగా, కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసేవాడు.అలా ఆయన నటించిన చిత్రాలలో ‘గమ్యం’ చిత్రం ఆయనకీ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.అయితే మళ్ళీ ఆయన రొటీన్ కామెడీ సినిమాలు చెయ్యడం తో మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది.

ఆ సమయం లో ఆయన తన రూట్ ని మార్చుకొని ‘నాంది’ సినిమాతో మన ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు.ఆ సినిమా సూపర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అయిన అల్లరి నరేష్, ఆ తర్వాత ‘మారేడుమల్లి నియోజకవర్గం’ సినిమాతో మన ముందుకి వచ్చాడు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ మంచి ప్రయత్నం చేసినందుకు అల్లరి నరేష్ కి విమర్శకుల ప్రశంసలు లభించింది.ఇప్పుడు ఆయన ‘ఉగ్రం’ అనే సినిమాతో పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకి రాబోతున్నాడు.

ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు.ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషించాడు.టీజర్ లోనే ఆయన అదరగొట్టేసాడు, తనని అంత మాస్ యాంగిల్ లో చూసేసరికి ఆడియన్స్ కూడా థ్రిల్ కి గురయ్యారు.ఈరోజు విడుదలైన ట్రైలర్ ని ఒకసారి పరిశీలిస్తే, నగరం లో వరుసగా ఆడవాళ్లు కిడ్నాప్ కి గురి అవుతూ ఉంటారు.అందులో హీరో అల్లరి నరేష్ భార్య పిల్లలు కూడా ఉంటారు.

ఈ కిడ్నాప్ వెనుక దాగి ఉన్న వ్యక్తి ఎవరు?, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు.హీరో చివరికి అతనిని పట్టుకొని , ఆడవాళ్లను విడిపించాడా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.ట్రైలర్ లో అల్లరి నరేష్ వీరోచితంగా చేసిన ఫైట్స్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి స్పందన లభించింది.కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమా.చూడాలి మరి ట్రైలర్ లాగానే సినిమా కూడా ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అనేది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు