Allari Naresh- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో అల్లరి నరేష్.. క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్

ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కనీసం కోటి రూపాయిల షేర్ ని అయినా రాబడుతుందో లేదో అనే అనుమానం లో ఉంది ట్రేడ్.అయితే అల్లరి నరేష్ మాత్రం మంచి జోష్ మీద ఉన్నాడు, నేడు ఆయన ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో కాసేపు చిట్ చాట్ చేసాడు.

  • Written By: Vicky
  • Published On:
Allari Naresh- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో అల్లరి నరేష్.. క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్

Allari Naresh- Pawan Kalyan: అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని సొంతం చేసుకుంది. ‘నాంది’ చిత్రం నుండి రూట్ మార్చి వరుసగా సీరియస్ రోల్స్ చేస్తున్న అల్లరి నరేష్ కి ఈ చిత్రం ద్వారా మంచి పేరు అయితే వచ్చింది కానీ, కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కనీసం కోటి రూపాయిల షేర్ ని అయినా రాబడుతుందో లేదో అనే అనుమానం లో ఉంది ట్రేడ్.అయితే అల్లరి నరేష్ మాత్రం మంచి జోష్ మీద ఉన్నాడు, నేడు ఆయన ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో కాసేపు చిట్ చాట్ చేసాడు. ఈ చాట్ సెషన్ లో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు.

అందులో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ‘మా హీరో తో సినిమా ఎప్పుడు చేస్తావు అన్నయ్యా’ అని అడగగా, దానికి అల్లరి నరేష్ సమాధానం చెప్తూ ‘నేను ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాను మీలాగే, పవర్ స్టార్ సినిమాలో ఎలాంటి రోల్ అయినా చెయ్యడానికి నేను సిద్ధం’ అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలో అల్లరి నరేష్ చేసి, అది అద్భుతమైన పాత్ర అయితే మాత్రం అల్లరి నరేష్ కి ‘గమ్యం’ లాంటి ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక చాలా మంది అభిమానులు అల్లరి నరేష్ ని ‘ఈమధ్య మీరు కామెడీ కి బాగా దూరం అవుతున్నారు, దయచేసి కామెడీ సినిమాలను వదలొద్దు అని అంటాడు’.అప్పుడు అల్లరి నరేష్ నా తదుపరి చిత్రం మీరు కోరుకునే పూర్తి స్థాయి కామెడీ సినిమా, అది కచ్చితంగా మిమల్ని అలరిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు