Chapati: రాత్రిపూట చపాతీ తినేవారంతా ఇది గమనించాల్సిందే
Chapati: ఇటీవల కాలంలో చాలా మందికి మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో వారు ఆహార నియమాలు పాటించక తప్పడం లేదు. ఇన్నాళ్లు మూడు పూటల అన్నం తినేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా అన్నం మానేయాలంటే కష్టమే. కానీ ఆరోగ్య రీత్యా తప్పడం లేదు. అన్నంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అన్నం మానేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో అన్నం మానేస్తున్నారు. చపాతీలు తింటున్నారు. రాత్రి […]


Chapati
Chapati: ఇటీవల కాలంలో చాలా మందికి మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో వారు ఆహార నియమాలు పాటించక తప్పడం లేదు. ఇన్నాళ్లు మూడు పూటల అన్నం తినేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా అన్నం మానేయాలంటే కష్టమే. కానీ ఆరోగ్య రీత్యా తప్పడం లేదు. అన్నంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అన్నం మానేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో అన్నం మానేస్తున్నారు. చపాతీలు తింటున్నారు. రాత్రి పూట భోజనంలో చపాతీలు తీసుకుంటున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
అన్నం మానేసి చపాతీలు తింటున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇన్నాళ్లు అన్నం తెగ తిని ఇప్పుడు వదిలేయాలంటే ఇబ్బందులే. మాయదారి రోగం నాకే రావాలా అంటూ భోజనం విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. కాకపోతే చపాతీలు వేడివేడిగా కాకుండా చల్లగా తీసుకోవడమే మంచిది. చల్లారాక అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే చల్లనివి తినడమే ఉత్తమం. అన్నం కూడా రాత్రి వండుకుని ఉదయం తింటే మంచిదని డాక్టర్లే చెబుతున్నారు.
చపాతీలే ఎందుకు తినాలి
రాత్రి భోజనంలో అన్నానికి బదులు చపాతీలు తింటే ప్రొటీన్లు అందుతాయి. అన్నం తింటే ఎక్కువగా కొవ్వుగా మారే అవకాశాలుంటాయి. అందుకే తక్కువ కేలరీలు ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారు. చపాతీలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అయితే చపాతీలు ఓ రెండు తిని మిగతా అన్నం తినడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువ శక్తి ఖర్చు కాదు. రాత్రి వేళ పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించడం మంచిది.

Chapati
అన్నం తింటే..
అన్నం తింటే అధిక కేలరీల శక్తి వస్తుంది. చపాతీలు తింటే ఆరోగ్య పరిరక్షణకు సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి,ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీసు, సిలికాన్, మెగ్నిషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉండటంతో చపాతీలు తింటే ప్రయోజనాలు ఉంటాయి. ఐరన్ ఎక్కువ శాతం ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. చపాతీలు కాకుండా పుల్కాలు తింటే ఇంకా లాభాలుంటాయి. నూనె రాయకపోతేనే మనకు మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.