Allu Arjun Rejected Movies: ఆ సూపర్ హిట్ సినిమాలు అన్ని అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినవే

పుష్ప సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ సుకుమార్ కలిసి ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాలు చేశారు. అంతేకాదు వీరిద్దరూ మంచి స్నేహితులు అని కూడా ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.

  • Written By: Vicky
  • Published On:
Allu Arjun Rejected Movies: ఆ సూపర్ హిట్ సినిమాలు అన్ని అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినవే

Allu Arjun Rejected Movies: గంగోత్రి సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు . ఒకప్పుడు కేరళలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మాత్రమే తనను అత్యంత ప్రేమించే అభిమానులు ఉన్న ఈ హీరో పుష్ప సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి అలాంటి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఏవో చూద్దాం.

100% లవ్

పుష్ప సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ సుకుమార్ కలిసి ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాలు చేశారు. అంతేకాదు వీరిద్దరూ మంచి స్నేహితులు అని కూడా ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. అయితే సుకుమార్ సూపర్ హిట్ సినిమా 100% లవ్ లో కూడా అల్లుఅర్జున్ నటించాల్సి ఉండింది అంట, కానీ ఎందుకో తెలియదు ఈ సినిమా నాగచైతన్య చేతికి వెళ్ళింది.

భద్ర

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను మొదటిగా దర్శకత్వం వహించిన సినిమా భద్ర. రవితేజ కెరియర్ లో మంచి హిట్ గా మిగిలిన ఈ సినిమాలో ముందుగా అల్లు అర్జున్ నటించిమని బోయపాటి అడగగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ సినిమా చేయలేదట. ఇక ఆ తరువాత బోయపాటి అల్లు అర్జున్ కలిసి చేసిన సినిమా సరైనోడు యావరేజ్ హిట్ గా మిగిలింది.

జయం

యంగ్ హీరో నితిన్ నటించిన మొదటి చిత్రం జయం. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు ఈ హీరో. ఈ సినిమా అప్పట్లో తేజ ని కూడా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. తేజ ఈ సినిమా కోసం ముందుగా అల్లు అర్జున్ ని సంప్రదించగా, అర్జున్ గంగోత్రి సినిమా తో బిజీగా ఉండటం వల్ల ఆ చిత్రం వదులుకోవాల్సి వచ్చిందట. దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

అర్జున్ రెడ్డి

తెలుగు ఇండస్ట్రీ లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ సినిమాలలో అర్జున్ రెడ్డి ఒకటి. ముందుగా ఈ సినిమా అల్లుఅర్జున్ దగ్గరికి పోయిందంట. కానీ అలాంటి కథలకు తాను సూట్ కానని రిజెక్ట్ చేశారు అల్లు అర్జున్. దాంతో ఈ కథ విజయ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది.

ఇక ఇవే కాకుండా విజయ దేవరకొండ నటించిన గీత గోవిందం, నాని గ్యాంగ్ లీడర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలు కూడా మొదటగా అల్లు అర్జున్ కి వచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల అవి మళ్ళీ వేరే హీరోలకు వెళ్లిపోయాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు