Rohit Sharma: ఐపీఎల్ అందరు కెప్టెన్లు ఉన్నా.. ముంబై కెప్టెన్ రోహిత్ మిస్సింగ్.. ఏమైంది?

Rohit Sharma: మరి కొద్ది గంటల్లో ఐపిఎల్ ప్రారంభం కానుంది. 16వ సీజన్ ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టోర్నీ ఆరంభ కోసం అహ్మదాబాద్ చేరుకున్న అన్ని జట్లు.. ట్రోపీ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ వీ రిలో ముంబై జట్టు కెప్టెన్ కనిపించలేదు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి ఫోటో షూట్ కు ఎవరూ […]

Rohit Sharma: ఐపీఎల్ అందరు కెప్టెన్లు ఉన్నా.. ముంబై కెప్టెన్ రోహిత్ మిస్సింగ్.. ఏమైంది?

Rohit Sharma: మరి కొద్ది గంటల్లో ఐపిఎల్ ప్రారంభం కానుంది. 16వ సీజన్ ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టోర్నీ ఆరంభ కోసం అహ్మదాబాద్ చేరుకున్న అన్ని జట్లు.. ట్రోపీ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ వీ
రిలో ముంబై జట్టు కెప్టెన్ కనిపించలేదు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి ఫోటో షూట్ కు ఎవరూ రాకపోవడంతో ఒకింత సందిగ్ధం నెలకొంది. రోహిత్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ అయినా వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అతడు కూడా రాకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో ఏం జరుగుతుందో అంతు పట్ట కుండా ఉంది.

అయితే రోహిత్ కు ఏం జరిగింది అని ఆరా తీస్తే.. అతడు అనారోగ్యానికి గురయ్యాడట. అందుకే ఫోటోషూట్ కు రాలేదట. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు అంతరంగికులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. “అకస్మాత్తుగా రోహిత్ కు ఒంట్లో నలత చేసిందని, దీంతో అతడు కెప్టెన్ల మీటింగ్ కు హాజరు కాలేదని” అని ముంబై ఇండియన్స్ జట్టు నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో అతడి స్థానంలో మరొకరిని ముంబై టీం మేనేజ్మెంట్ ఫోటోషూట్ కు పంపకపోవడం విశేషం. మరి ఇలా అనారోగ్యానికి గురైన రోహిత్.. ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. గతంలో బంగ్లాదేశ్ టోర్నీలో కూడా రోహిత్ అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటినుంచి అతడి ఆరోగ్యం అంతగా బాగోటం లేదు. ఒకవేళ అతని ఆరోగ్యం కుదురుకొని పక్షంలో ఈటోర్నీలో ఆడేది అనుమానంగానే ఉంటుంది.

Rohit Sharma

Rohit Sharma

ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లకూ ఈ సీజన్ లో ఇదే మొదటి మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అభిమానులు తెగ సంతోషిస్తారు. ఐపీఎల్ లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ అన్నా, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ అన్నా, ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ అన్నా .. అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఎన్నో అంచనాలు ఉండే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు రోహిత్ దూరం అవుతాడని వస్తున్న వార్తలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అయితే అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ముంబై ఇండియన్స్ జట్టు మాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తోంది.. అబ్బే అలాంటిది ఏమీ లేదని, నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని సూచిస్తున్నది.

అయితే రోహిత్ కు మరి అంత తీవ్రమైన అనారోగ్యం కాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అతడు త్వరగానే కోలుకుంటాడని వెల్లడిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి అతడు పూర్తిగా ఫిట్ గా ఉంటాడని అంటున్నాయి.. బెంగళూరు తో జరిగే మ్యాచ్ చిన్న స్వామి స్టేడియంలో నిర్వహిస్తున్నారు..రోహిత్, విరాట్ ప్రత్యర్ధులుగా బరిలోకి దిగే ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ మే తొమ్మిదవ తేదీన ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ రెండు జట్లు మరోసారి తలపడతాయి.

Tags

    follow us