HBD GlobalStar Ram Charan : రంగస్థలం పార్ట్-2కి ముహూర్తం ఫిక్స్.. పుట్టినరోజు నాడు చరణ్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్

HBD GlobalStar Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని కూడా విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ […]

  • Written By: Naresh
  • Published On:
HBD GlobalStar Ram Charan  : రంగస్థలం పార్ట్-2కి ముహూర్తం ఫిక్స్.. పుట్టినరోజు నాడు చరణ్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్

HBD GlobalStar Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని కూడా విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా నేడు విడుదల అయ్యింది.

ఈ ప్రాజెక్ట్ పై రామ్ చరణ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.గత కొద్దీ రోజుల క్రితం ఒక నేషనల్ మీడియా లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు రామ్ చరణ్.నా కెరీర్ లో రంగస్థలం చిత్రం ఎంతో ప్రత్యేకమైనది అని, ఇప్పుడు నేను త్వరలో బుచ్చి బాబు తో చెయ్యబోతున్న సినిమా రంగస్థలం చిత్రాన్ని మించి ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా సెప్టెంబర్ నెల నుండి పట్టాలెక్కబోతుంది అనే విషయం కూడా చెప్పుకొచ్చాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ మరియు వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.రంగస్థలం చిత్రం లాగానే ఈ సినిమా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది అట.ఇందులో నటించే నటీనటుల విషయం గురించి ప్రస్తుతానికి అయితే తెలియదు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమానే రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యింది అనే టాక్ ఫిలిం నగర్ లో ఎప్పటి నుండో ఒక వార్త ప్రచారం లో ఉంది.ఈ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు.ఆ తర్వాత ఆయన బాలీవుడ్ , హాలీవుడ్ లో కూడా సినిమాలు చెయ్యడానికి సంతకాలు చేసాడు.

సంబంధిత వార్తలు