Non Vegetarian Food: మాంసాహారం తినేవాళ్లంతా అలెర్ట్.. ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
యూరిక్ యాసిడ్ పరిమానం పెరిగితే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. నాన్ వెజ్ ఫుడ్స్ తో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రమవుతుంది.

Non Vegetarian Food: నేటి కాలంలో ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇష్టారాజ్యంగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకు నష్టాలే వస్తాయి. దీంతో పలు రోగాలకు కారణమవుతుంది. దీని వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య రావడానికి మాంసాహారమే కారణం. అందుకే మనం మాంసాహారం తగ్గించడమే ఉత్తమం. కానీ ఎంత మంది మనం చెప్పినట్లు వింటారు. వారికి ఇష్టమొచ్చినవే తింటుంటుంటారు.
యూరిక్ యాసిడ్ పరిమానం పెరిగితే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. నాన్ వెజ్ ఫుడ్స్ తో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రమవుతుంది. ఈ రోజు యూరిక్ యాసిడ్ కు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్నాయి. నాన్ వెజ్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. మాంసాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.
అధిక యూరిక్ యాసిడ్ వల్ల కాలేయం, కిడ్నీ దెబ్బతినే సూచనలున్నాయి. యూరిక్ యాసిడ్ పురుషుల్లో 4 నుంచి 4.5 మిల్లీగ్రాములు, స్త్రీలలో 3.5 నుంచి 6 మిల్లీ గ్రాముల మధ్య ఉండాలి. కానీ మన ఆహార అలవాట్లతో అది ఎక్కువగానే ఉంటోంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మూత్రపిండాల వైఫల్యం కనిపిస్తుంది. దీంతో చికిత్స తప్పనిసరి అవుతోంది.
యూరిక్ యాసిడ్ సమస్యను ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకుంటే నయం చేసుకోవచ్చు. కిడ్నీల్లో తీవ్రమైన నొప్పి వచ్చి నడవలేకుండా ఉంటే అర్థరైటిస్, యూరిక్ యాసిడ్ అధికంగా పెరిగినప్పుడు భరించలేని నొప్పి వస్తుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపించవు. రక్తపరీక్షల ద్వారా తెలుస్తుంది. శారీరక శ్రమ చేయడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎక్కువ నీరు తాగడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది. వ్యాయామం చేయడం కూడా ఒక సూచన.
