Free Alcohol: మందు కొంటే గుడ్డు ఫ్రీ.. రెండు బీర్లకు ఒక బీరు ఫ్రీ.. బంఫర్ ఆఫర్..
డిస్కౌంట్లు, ఆఫర్లు గృహ వినియోగ వస్తువులపై ఎక్కవగా ఉంటాయి. ఇక ఆషాఢం వచ్చిందంటే కేజీ చొప్పున విక్రయిస్తారు. కానీ మందు విక్రయంలో మాత్రం ఎలాంటి రాయితీలు ఉండవు. ఎందుకంటే రాయితీలతో పని లేకుండా ఇవి అత్యధికంగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. రేట్లు ఎంత పెంచినా మద్యం తాగేవారి సంఖ్య తగ్గదనే చెప్పాలి. కానీ తమిళనాడు రాష్ట్రానికి అందుబాటులో ఉన్న పుదుచ్చేరిలో మాత్రం అలా కాదు. ఇక్కడ నిత్యం మద్యం విషయంలో రాయితీలు ప్రకటిస్తూ ఉంటారు.

Free Alcohol: గత సంవత్సర కాలంగా మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కరోనా సమయంలో ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు ముడి సరుకు రేట్లు పెంచడంతో వీటి ధరలు పెరిగాయి. ఆ తరువాత కొన్ని నెలల కిందట కొంత మేరకు తగ్గించారు. అయితే ఓ ప్రదేశంలో రెండు బీర్లు కొంటే ఒక బీరు ఫ్రీ అనే ఆపర్ ఉంది. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు న్యూ ఇయర్ వేడుకలు, ఇతర ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఉంటాయి. కానీ 365రోజులు అక్కడ రెండు బీర్లు కొన్నవారికి ఒక బీరును ఉచితంగా ఇస్తున్నారు. బీర్లు మాత్రమే కాకుండా ఇతర వైన్ ధరలు కూడా అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా..?
డిస్కౌంట్లు, ఆఫర్లు గృహ వినియోగ వస్తువులపై ఎక్కవగా ఉంటాయి. ఇక ఆషాఢం వచ్చిందంటే కేజీ చొప్పున విక్రయిస్తారు. కానీ మందు విక్రయంలో మాత్రం ఎలాంటి రాయితీలు ఉండవు. ఎందుకంటే రాయితీలతో పని లేకుండా ఇవి అత్యధికంగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. రేట్లు ఎంత పెంచినా మద్యం తాగేవారి సంఖ్య తగ్గదనే చెప్పాలి. కానీ తమిళనాడు రాష్ట్రానికి అందుబాటులో ఉన్న పుదుచ్చేరిలో మాత్రం అలా కాదు. ఇక్కడ నిత్యం మద్యం విషయంలో రాయితీలు ప్రకటిస్తూ ఉంటారు.
దేశంలోని మిగతా ప్రదేశాల్లో కంటే ఇక్కడ మద్యం వివిధ రకాల్లో లభ్యం అవుతుంది. అంతేకాకుండా టేస్టీగా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకే దేశం నలుమూలల నుంచి మద్యం ప్రియులు ఎంజాయ్ చేయడానికి పుదుచ్చేరికి వస్తుంటారు. ఈ సందర్భంగా ఇక్కడున్న ఓ షాపు నిర్వాహకుడు రెండు బీర్లు కొంటే ఒక బీరు ఫ్రీ అనే ఆఫర్ ప్రకటించాడు. పుదుచ్చేరిలో మొత్తం 900 రకాల మద్యం, 35 రకాల బీర్లు దొరుకుతాయి. వాటికి తగిన బార్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ స్టే చేసే హోటల్ గదిలోకే మద్యం సీసాలను అందిస్తారు.
మద్యం మాత్రమే కాకుండా ఫుడ్ విషయంలో ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. మందు కొంటే కోడి గుడ్డు ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉంది. ఇలా రకరకాల ఆఫర్లు ఉండడంతో పాటు వివిధ రకాల మద్యం లభిస్తుండడంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మాన్ సూన్ లో ఇక్కడి వెదర్ కూడా చాలా బాగా ఉండడంతో ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అయితే గతంలో మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం దుకాణాలు తెరిచారు. దీని గురించి ప్రకటనలు కూడా ఇచ్చారు. వీటిపై విమర్శలు రావడంతో వాటిని తీసేశారు.