రామ్ సినిమాలో మరో టాలెంటెడ్ బ్యూటీ !
ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ సరసన మరో టాలెంటెడ్ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తోంది. అక్షర నటిస్తోందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా అక్షర గౌడ్ ప్రస్తుతం […]

ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ సరసన మరో టాలెంటెడ్ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తోంది.
అక్షర నటిస్తోందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా అక్షర గౌడ్ ప్రస్తుతం షూటింగ్ లో కూడా పాల్గొంటోందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న హీరో ఆది సరసనే అక్షర గౌడ నటిస్తుందట. పైగా ఆమె పాత్ర చాల పవర్ ఫుల్ గా ఉంటుందని, పల్నాటి నాగమ్మ పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమా కోసం బోల్డ్ గా కనిపించనుంది.
కృతి శెట్టిది ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ రోల్ అట. మరి మొదటిసారి కృతి గ్లామర్ గా కనిపిస్తోంది కాబట్టి, ఈ సినిమాకి ఆమె అందం బాగా ప్లస్ అవుతుంది. నదియా ఈ సినిమాలో రామ్ కి తల్లిగా నటిస్తోంది. ఆమెది కూడా చాల కీలక పాత్ర అట. మంచి ఎమోషన్ తో నడిచే హెవీ ఎమోషనల్ రోల్ అట. ఇక సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి పాటలను స్వర పరుస్తున్నాడు.
ఇప్పటికే దేవి నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడు. సాంగ్స్ అన్ని అద్భుతంగా వచ్చాయట. నిజానికి రామ్ కి దేవి శ్రీ ప్రసాద్ ముందు నుంచి మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో మ్యూజిక్ పరంగా మంచి సూపర్ హిట్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వీరి కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
