Thegimpu Movie Review: నటీనటులు : అజిత్ , మంజు వారియర్ , జాన్ కొక్కెన్ ,యోగి బాబు , సముద్ర ఖని , మహానది శంకర్
నిర్మాత : బోనీ కపూర్
డైరెక్టర్ : హెచ్ . వినోద్
మ్యూజిక్ డైరెక్టర్ : గిబ్రాన్
సినిమాటోగ్రఫీ :నిరవ్ షా
డిస్ట్రిబ్యూటర్ : రెడ్ జైన్ట్ మూవీస్

Ajith
తమిళ నాడు ల కోట్లాది మంది అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన తల అజిత్ ‘తూనీవు’ సినిమా నేడు తెలుగు మరియు తమిళం బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..తెలుగు లో ఈ సినిమాని ‘తెగింపు’ అనే పేరుతో విడుదల ఈరోజు విడుదల చేసారు..అజిత్ తో గతం లో నేర్కోండ పార్వై, వలిమై వంటి సినిమాలు తీసిన వినోద్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు..ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ అజిత్ వినోద్ కి పిలిచి మరీ ‘తూనీవు’ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు..మరి తనకి ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ని వినోద్ ఉపయోగించుకున్నాడా..? అజిత్ కి సూపర్ హిట్ ఇచ్చాడా..?? ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
కథ :
ఈ చిత్రం లో అజిత్ కి ఒక పేరు అంటూ ఉండదు..డార్క్ డెవిల్ , చీఫ్ మరియు మైఖేల్ జాక్సన్ వంటి పేర్లతో పిలవబడుతాడు..డార్క్ డెవిల్ , కన్మణి( మంజు వారియర్ ) మరియు మరో ముగ్గురు కలిసి ఒక టీం గా ఏర్పడి తమ దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఆయుధాలతో, క్రిష్(జాన్ కొక్కెన్) మ్యానేజర్ గా ఉన్న యువర్ బ్యాంక్ ని దోపిడీ చెయ్యడానికి వస్తారు..అసలు వీళ్ళు ఈ బ్యాంకు ని దోపిడీ చెయ్యాల్సిన అవసరం ఏమిటి..? హీరో ఇచ్చే ట్విస్టులు ఏమిటి? బ్యాంకులు చేస్తున్న కొన్ని స్కామ్స్ మీద చివర్లో ‘తెగింపు’ ఇచ్చిన సందేశం ఏమిటనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
డైరెక్టర్ మంచి పాయింట్ మీద కథని సిద్ధం చేసాడు కానీ..చివరి నిమిషం వరకు గ్రిప్పింగ్ గా తియ్యడం లో మాత్రం విఫలం అయ్యాడనే చెప్పాలి..ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లో పేస్ మీద సాగిపోతుంది..కాస్త జనరంజకంగా తీస్తే బాగుండేది అనే అనుభూతి కలుగుతుంది..అంతే కాకుండా ఇది వరకే ఈ కాన్సెప్ట్ మీద విజయ్ హీరో గా నటించిన బీస్ట్ వచ్చింది..’తునీవు’ సినిమాని చూస్తున్నంతసేపు మనకి ఫస్ట్ హాఫ్ బీస్ట్ సినిమా గుర్తుకు వస్తుంది..ఇక సెకండ్ హాఫ్ మొత్తం గత ఏడాది లో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారు పాట’ చిత్రం గుర్తుకు వస్తుంది..సెకండ్ హాఫ్ మెసేజి అదే..సినిమాకి పాజిటివ్ పాయింట్ గా మారింది కూడా ఆ సందేశమే.
ఈ సినిమాలో కథ సాలిడ్ గా లెకపొయ్యేసరికి భారం మొత్తం అజిత్ పైనే పడింది..వన్ మ్యాన్ షో లాగ ఆయనే ఈ సినిమాకి ఏకైక పాజిటివ్ అనిపించుకున్నాడు..తన వింటేజ్ మార్క్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేసాడు..ఈ సినిమాకి వచ్చే ప్రతీ పైసా అజిత్ ని చూసి రావాల్సిందే..ఇక మంజు వారియర్ కి కూడా అద్భుతమైన క్యారక్టర్ పడింది..తన పరిధి మేరకు సినిమాని రక్తికట్టించడం లో సహాయపడింది..మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదని అనిపించారు..గిబ్రాన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చింది..మొత్తానికి సినిమా అభిమానులను పూర్తి స్థాయిలో నిరాశపర్చకుండా పర్వాలేదని అనిపించుకుంది.

Ajith
చివరి మాట:
టైం పాస్ కోసం ఒకేసారి చూడాలి అనుకున్నోళ్లకి ఈ సినిమా వీకెండ్ కి ఒక బెస్ట్ ఛాయస్ అవుతుంది.. అజిత్ ఫ్యాన్స్ కి మాత్రం బాగా నచుతుంది..మామూలు ప్రేక్షకులకు మాత్రం ఒకసారి చూడొచ్చు అనిపిస్తాది.
రేటింగ్ : 2.5 /5