Aishwarya Rai: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పెళ్లి అయిపోయి సినిమాలకు దూరమైంది. మధ్యమధ్యలో కొన్ని ముఖ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తోంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ కీలక పాత్రధారిగా నటించింది. అయితే ఆమె అందం, చందం ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రం ద్వారా నిరూపితమైంది.

Aishwarya Rai
తాజాగా తన కూతురు జన్మదినం సందర్భంగా ఆరాద్యతో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఐశ్వర్యరాయ్. కూతురు ఆరాధ్యకు ‘లిప్ టు లిప్’ కిస్ ఇస్తూ.. ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యు ఆరాధ్య’ అని పేర్కొంటూ కుమార్తెతో దిగిన ఓ ఫొటోను ఐశ్వర్య ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఇందులో కూతురు ఆరాధ్యకు లిప్ టు లిప్ కిస్ ఇస్తూ కనిపించింది.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూతురుకు అలా ముద్దు ఇవ్వడం ఏంటని.. చెంపపై లేదా నుదుటిపై ఇవ్వడం సంస్కారం అని కొందరు హేతువాద నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చిన్నారిని పెదవులపై ముద్దుపెట్టుకోవడం వింతగా ఉంది ఇలా చేయవద్దంటూ అంటూ ఐశ్వర్యకు హితవు పలుకుతున్నారు.

Aishwarya Rai
ఇక ఇంకొందరైతే ఇది తల్లి బిడ్డల ప్రేమకు సంబంధించిన విషయం అని.. ఎక్కడ ముద్దు పెట్టుకుంటే మీకేంటి అంటూ ఐశ్వర్యకు సపోర్టుగా ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.