Aishwarya Lekshmi: ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే యాక్టింగ్ తో పని లేదు అంటున్న ఐశ్వర్య…
ఇండస్ట్రీలో యాక్టింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు దాంతోపాటు అందం కూడా ఉండాలి అప్పుడే హీరోయిన్లకి ఎక్కువగా అవకాశాలు వస్తాయి అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది.

Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక అవకాశం వచ్చి వాళ్ళు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ల నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగడానికి వాళ్లు మంచి స్టోరీస్ ని ఎంచుకొని మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అలా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న హీరోయిన్ ఎవరు అంటే ఐశ్వర్య లక్ష్మి అనే చెప్పాలి. 2017లో ఈమె మలయాళ ఇండస్ట్రీలో తన ఫస్ట్ సినిమాని చేశారు.ఆవిడ కెరియర్ మొదట్లో ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేవారు దానివల్లే ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో ఆవిడ 2019లో విశాల్ కి జంటగా కోలీవుడ్ లో ఒక సినిమాలో నటించింది.ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా గట్ట కుస్తీ అనే చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తో ఆవిడకి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అందులో భాగంగానే మణిరత్నం తీసిన పోన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో పుంగులి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది కేవలం ఈవిడ నటనతోనే కాకుండా అందం తోను ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుందనే చెప్పాలి ఇక అలాగే ఈ మధ్య ఆవిడ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంటే అంత ఈజీ కాదు ఒకవేళ కూడా ఇక్కడ హీరోయిన్ గా ఎదిగిన కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆవిడ చెప్పడం జరిగింది.
ఇండస్ట్రీలో యాక్టింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు దాంతోపాటు అందం కూడా ఉండాలి అప్పుడే హీరోయిన్లకి ఎక్కువగా అవకాశాలు వస్తాయి అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది. అయితే ఐశ్వర్య కి మొదట ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ లేదట ఆవిడ డాక్టర్ అవ్వాలనుకుంది కానీ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఆవిడ కొన్ని ఆడ్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది. దానివల్లే తనకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈవిడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ తన కెరీయర్ ని చాలా బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు….
