Aishwarya Lakshmi: స్లీవ్ లెస్ టాప్ లో మైండ్ బ్లాక్ చేసే గ్లామర్… ఐశ్వర్య లక్ష్మీ టెంప్టింగ్ ఫోటో షూట్ వైరల్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లో ఐశ్వర్య లక్ష్మి నటించింది. ముఖ్యంగా మొదటి పార్ట్ లో పడవ నడిపే అమ్మాయిగా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య పాత్ర పేరు పూంగుఝాలి.

Aishwarya Lakshmi: మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో ఐశ్వర్య ఫస్ట్ మూవీ గాడ్సే. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ సెటైరికల్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. అనంతరం అమ్ము టైటిల్ తో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేసింది. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశాడు. పొగరు బట్టిన పోలీస్ భర్తకు బుద్ధి చెప్పే భార్య పాత్రలో ఐశ్వర్య లక్ష్మి అద్భుతంగా నటించింది. ఐశ్వర్య లక్ష్మికి మంచి నటిగా పేరుంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లో ఐశ్వర్య లక్ష్మి నటించింది. ముఖ్యంగా మొదటి పార్ట్ లో పడవ నడిపే అమ్మాయిగా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య పాత్ర పేరు పూంగుఝాలి. ఆ పాత్రలో సహజంగా నటించి మెప్పించింది. పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ కంటే ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది.
ఇటీవల కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. కింగ్ ఆఫ్ కొత్త తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. గొప్పగా నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి గ్లామరస్ హీరోయిన్ గా ఎదగలేకపోతున్నారు. ఆమెను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. ఎక్కువగా హోమ్లీ రోల్స్ తలుపు తడుతున్నాను.
అందుకే పంథా మార్చింది. సోషల్ మీడియాలో వేదికగా తనలోని హాట్ నెస్ పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి టెంప్టింగ్ ఫోజుల్లో చెమటలు పట్టించింది. ఐశ్వర్య లక్ష్మీ బోల్డ్ అవతార్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి నుండి ఈ కోణం ఊహించలేదని వాపోతున్నారు. మొత్తంగా ఐశ్వర్య హాట్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.
View this post on Instagram
