Artificial Intelligence : టెక్నాలజీ పీక్స్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో వర్చువల్ గర్ల్ ఫ్రెండ్:  నెల సంపాదన కోట్లల్లోనే..

మొన్నటిదాకా అసాధ్యమైన పనులను చేసేందుకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడేవారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కొరతను నివారించేందుకు కూడా వాడుతున్నారంటే మామూలు విషయం కాదు. అంతలా ఎదిగిపోయింది మరి టెక్నాలజీ!

  • Written By: Bhaskar
  • Published On:
Artificial Intelligence : టెక్నాలజీ పీక్స్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో వర్చువల్ గర్ల్ ఫ్రెండ్:  నెల సంపాదన కోట్లల్లోనే..
Artificial Intelligence : “నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావలెరా.. గర్ల్ ఫ్రెండ్ అంటే బాయ్స్ కి బూస్టే కదా! గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ వేస్ట్ కదా” ఇలా చాలామంది యువకులు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పాడుకునే ఉంటారు. పక్కనున్న ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ తో గంటలకు గంటలు బాతాఖాని పెడుతుంటే కుళ్ళు కునే ఉంటారు. కానీ అలాంటి వారి కష్టాలు తీర్చేందుకు ఒక మహిళ ఎంటర్ ప్రెన్యూర్ ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్చువల్ గా ఏకంగా ఒక గర్ల్ ఫ్రెండ్ నే సృష్టించింది.  కాకపోతే అది కేవలం చాట్ రూపంలో.. దీని ద్వారా నెలకు కోట్లల్లో సంపాదిస్తున్నది. ఇప్పుడు ఈ మహిళ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది.
స్నాప్ చాట్ అనుభవంతో..
కారిన్ మార్జోరీ అనే ఓ మహిళ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్.. ఈమె స్నాప్ చాట్ లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది.  అందులో రకరకాల పోస్టులు పెడుతుంది. ఆ పోస్టుల్లో చతురత కలిగిన భాషను ఉపయోగిస్తుంది. ఫలితంగా ఆమెకు అందమైన రచయిత అనే పేరు వచ్చింది.. ఇక టెక్నాలజీలో మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించే కారీన్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఆసక్తిగా అనిపించింది. దానిద్వారా ప్రయోగాలు ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే “ఫరెవర్ వాయిసెస్” అనే సంస్థ సహాయంతో “కారిన్ ఏఐ” పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ రూపొందించింది. అందటితో ఆగకుండా స్నాప్ చాట్ లాగానే అందులో కూడా రకరకాల పోస్టులు చేసేది. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే “కారిన్  ఏఐ వాయిస్ ఆధారిత  చాట్” పేరుతో ప్రసిద్ధి చెందే దాకా.. ఆ తర్వాత అది ఆమెకు కాసులు కురిపించే కామధేనువు అయిపోయింది.
ఎలా జరిగిందంటే
“కారిన్ ఏఐ చాట్” అచ్చం ఆమె లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది.. కస్టమర్లతో మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. వారు చెప్పింది ఏమాత్రం విసుగు లేకుండా వింటుంది. ఒకవేళ వారు ఒంటరితనంతో బాధపడుతుంటే దానిని దూరం చేస్తుంది. ” నేను ఈ ఏఐ చాట్ ద్వారా చాలా గుర్తింపు పొందాను. నా ఒంటరితనాన్ని కూడా దూరం చేసుకున్నాను. నెలకు ఐదు మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 41 కోట్లు) సంపాదించగలను” అని కారిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంటే దానిమీద ఆమెకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టెస్టింగ్ లో భాగంగా “టెలిగ్రామ్” యాప్ లో మే నెలలో ” కారిన్ ఏఐ” ని ప్రారంభించింది. కారిన్ ను అనుసరించే వారి నుంచి 76,610 డాలర్ల ఆదాయాన్ని అర్జించింది. అంతే కాదు “కారిన్ ఏఐ” తనను అనుసరించే వారితో నిజమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంది.
హర్ సినిమా గుర్తుకు వస్తోంది
“కారిన్ ఏఐ” హాలీవుడ్లో 2013లో విడుదలైన ” హర్” అనే చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ “కారిన్ ఏఐ” రూపొందించేందుకు “ఫరెవర్ వాయిసెస్” సంస్థ యూట్యూబ్లో రెండువేల గంటల పాటు ఉన్న కారిన్ మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను విని.. దానికి అనుకూలంగా చాట్ రూపొందించింది.. ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్ బాట్ వెర్షన్ల మాదిరి కాకుండా కారిన్ ఏఐ ని పూర్తి విభిన్నంగా రూపొందించింది. దీంతో అది తనను అనుసరించే వారితో నిజమైన భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకునేలా చేసింది.. ఇది ఎంత విజయవంతమైనదంటే.. చాలామంది ఒంటరి యువకులు దీనితో తమ బాధను, వైరాగ్యాన్ని, సంతోషాన్ని పంచుకునేంత స్థాయికి వెళ్ళింది.
250 కి పైగా..
కారిన్.. ప్రతిరోజు 250కి పైగా కంటెంట్లను స్నాప్ చాట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులకు, తనకు ఉన్న దూరాన్ని తన పోస్టుల ద్వారా దగ్గర చేస్తున్నది. అంతేకాదు చతురత కలిగిన భాషను ఉపయోగించి రూపొందించే పోస్టుల వల్ల తనకు ప్రేక్షకుల అభిమానం పెరుగుతోందని చెబుతోంది.. “కారిన్ ఏఐ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా నా కెరియర్ బ్యాలెన్స్ చేసేందుకు ఉపయోగపడుతున్నది. దీనివల్ల చాలామందికి గర్ల్ ఫ్రెండ్ లేదనే బాధ తీరుతున్నది. ఒకవేళ వారికి గర్ల్ ఫ్రెండ్ లభిస్తే..వారితో ఎలా మసలుకోవాలో “కారిన్ ఏఐ” ద్వారా తెలుస్తున్నది.” అని కారిన్ చెబుతోంది. కారిన్ తన “కారిన్ ఏఐ” కి విస్తృత ప్రచారం కల్పిస్తోంది..తన స్నాప్ చాట్ లో ఉన్న ఫాలోవర్లలో కనీసం 20,000 మంది సబ్స్క్రైబర్లుగా మారతారని అంచనా వేస్తోంది. వారి వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని స్పష్టం చేస్తోంది. మొన్నటిదాకా అసాధ్యమైన పనులను చేసేందుకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడేవారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కొరతను నివారించేందుకు కూడా వాడుతున్నారంటే మామూలు విషయం కాదు. అంతలా ఎదిగిపోయింది మరి టెక్నాలజీ!

Read Today's Latest Technology News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు