CM KCR – National Politics: తెలగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారు.. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలను ట్యూన్ చేసే పనిలో పడ్డారు.. దేశ రాజకీయాల్లో రాణించడం కోసం ముందు తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు కావాలని కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన సభావేదికగా తన భవిష్యత్ వ్యూహం బయటపెట్టారు.

CM KCR
తెలంగాణా ప్రజలు హామీ ఇస్తేనే..
దేశ రాజకీయాల్లో బీజేపీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో గద్దె దించుతామని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే.. ఏ రాష్ట్రంలో కూడా ఇతర పార్టీలు కేసీఆర్‌కు సుముఖంగా లేవు. బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. ఇప్పుడు తొందర పడితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా నష్టపోయే అవకాశం ఉందని గ్రహించారు. దీంతో జాతీయ వ్యూహం మార్చారు. మొదట రాష్ట్ర ప్రజలు సంపూర్ణ మద్దతు తనకే ఉండాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపక్షాల దూకుడు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకుంటునన్నాయి.. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్నట్లు బీజేపీ దూకుడు పెంచింది. మరోవైపు కాంగ్రెస్ కూడా 2023 ఎన్నికల నాటికి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేసస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు హామీ ఇస్తేనే, తెలంగాణ ప్రజలు తన వెంట ఉంటేనే తన దేశ రాజకీయాల్లో రాణించగలనని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు గులాబీ బాస్.
నాతో రండి.. నేను మీ వెంట ఉంటా…
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హామీ ఇస్తేనే దేశ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ప్రశ్నించినందుకు తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మోదీ అన్నారని, ‘‘మీరు నాతో రండి.. నేను మీతో ఉంటా’’ అని కోరారు. అందరం కలిసి దేశ రాజకీయాలను మార్చేద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని తెలంగాణ తరహాలో అభివృద్ధి చేసుకుందామన్నారు. అందుకు మీ సంపూర్ణ మద్దతు కావాలని అభ్యర్థించారు.
తెలంగాణా మద్దతు కోసమే..
తెలంగాణలో టీఆర్‌ఎస్ బలహీన పడుతోంది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని సీఎం కేసీఆర్ గ్రహించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటేనే దేశ రాజకీయాలలో ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభల్లో ప్రజల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవావ్వలని కోరుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న భావనతోనే కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని గెలిపించాలన్న ఆయన భావన ప్రస్ఫుటంగా అర్థమయ్యేలా చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

CM KCR
తెలంగాణ ప్రజలను ట్యూన్ చేస్తున్న కేసీఆర్
ప్రజలకు ఒకవైపున తెలంగాణ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తూనే, మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారు కేసీఆర్. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఏ పని చేస్తున్నా కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డు పడుతుందని ఆరోపిస్తున్నారు. ఇక కృష్ణా జలాల్లో వాటా తేల్చడానికి బీజేపీకి ఎనిమిదేళ్ల సమయం సరిపోలేదని, ఇక అనుమతులు ఎప్పుడు ఇస్తారు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో కీలకంగా వెళ్లేముందు తెలంగాణ ప్రజలు సంపూర్ణ మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.