Nayanthara: పెళ్ళయ్యాక ఆ పనికి సిద్ధమైన నయనతార… పది కోట్లకు టెంప్ట్ అయ్యిందా!
Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఫేమ్, నేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె పరిశ్రమను ఏలుతున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన నయనతార ప్రస్థానం లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. కొన్నాళ్లుగా ఆమె కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో టాప్ స్టార్స్ పక్కన జతకడుతున్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న నయనతార ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇస్తున్నారని […]


Nayanthara
Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఫేమ్, నేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె పరిశ్రమను ఏలుతున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన నయనతార ప్రస్థానం లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. కొన్నాళ్లుగా ఆమె కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో టాప్ స్టార్స్ పక్కన జతకడుతున్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న నయనతార ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇస్తున్నారని ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఆమె బికినీ ధరించబోతున్నారట.
షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న మూవీలో నయనతార బికినీలో కనిపిస్తారనేది కోలీవుడ్ టాక్. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఓ సన్నివేశంలో ఆమె బికినీలో అందాల ప్రదర్శన చేయనున్నారట. ఇలాంటి బోల్డ్ సీన్ లో నటించేందుకు నయనతార భారీగా డిమాండ్ చేశారట. జవాన్ చిత్రానికి నయనతార రెమ్యునరేషన్ రూ. 10 కోట్లు అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ… విన్న జనాలు మాత్రం పెదవి విరుస్తున్నారు. కాసుల కోసం ఇంత కక్కుర్తి అవసరమా అని ఎద్దేవా చేస్తున్నారు.
పెళ్లి కాకముందు ఇవన్నీ ఓకే. ఒకరి భార్య అయ్యాక సమాజం హర్షించదు. అదేమీ నేరం కాకపోయినప్పటికీ సౌత్ ప్రేక్షకులు దాన్నో సాహసంగా చెప్పుకుంటారు. నయనతార కెరీర్ బిగినింగ్ లో స్కిన్ షో చేశారు. లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటించారు. అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా మూవీలో ఆమె సెమీ బికినీలో దర్శనమిచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ మూవీ కోసం ఏకంగా టూ పీస్ బికినీ వేసిందంటున్నారు.

Nayanthara
కాగా నయనతార 2022లో వివాహం చేసుకున్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేశారు. 2015 నుండి విగ్నేష్-నయనతార రిలేషన్ లో ఉన్నారు. ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సరోగసీ పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు నయనతార తల్లి అయ్యారు. ఇది వివాదాస్పదమైంది. తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయ్యింది. నయనతార దంపతులు విచారణ ఎదుర్కొన్నారు. అయితే తమకు ఐదేళ్ల క్రితమే పెళ్లైంది. సరోగసీ నిబంధనలు పాటించాం అంటూ ఆధారాలు చూపించి కేసు నుండి బయటపడ్డారు.
