2024 Elections- News Papers: వచ్చే నెల నుంచి ఈనాడు కాంపౌండ్ నుంచి పబ్లిష్ అయ్యే అన్నదాత మ్యాగజిన్ ఇక రాదు. ఆ సంచిక ఎడిటర్ హరికృష్ణ మొన్ననే ఒక ప్రకటన చేశాడు.. దీంతో తెలుగు జర్నలిజం సర్కిల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.. వాస్తవానికి పేపర్ పరిశ్రమలో భారీగా లాభాలు గడిచింది ఒక రామోజీరావు మాత్రమే.. అని అంతటి రామోజీరావు తనవల్ల కాదు అని అన్నదాతను మూసివేసాడు అంటే పరిస్థితి బాగోలేదని, ఇకముందు అసలు బాగోదని అర్థం. ఇప్పుడు ఈ పతనం ఒక్క అన్నదాత తోనే మొదలు కాలేదు. కోవిడ్ కి ముందే ప్రమాదగంటికలు మోగాయి.

2024 Elections- News Papers
కోవిడ్ నేపథ్యంలో..
వార్తాపత్రికలు వార్తాపత్రికల మాదిరి ఉంటే వచ్చిన ఇబ్బంది ఏది ఉండేది కాదు.. కానీ వాళ్ల పేపర్లకు మాదిరే రాజకీయ రంగులు పూసుకోవడం వల్ల జనాల్లో ఒక ఏవగింపు మొదలైంది.. ఇది అంతిమంగా న్యూస్ పేపర్ల భవితవ్యాన్ని దెబ్బతీసింది. న్యూస్ పేపర్ల భవితవ్యం దెబ్బతింటే మొదట నష్టపోయేది ఉద్యోగులే.. ఎందుకంటే కోవిడ్ మొదటి దశ ప్రారంభంలో యాజమాన్యాలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను తీసి పక్కన పెట్టాయి. ఫలితంగా చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కోవిడ్ సమయంలో ఉన్న ఆకొద్దిమంది ఉద్యోగుల్లో అనారోగ్యానికి గురై కన్నుమూస్తే రూపాయి కూడా ఇవ్వలేదు. ఉదయం లేస్తే ఆ మోడీని తిట్టడంలో పోటీ పడే పత్రికలు.. పనిచేసే జర్నలిస్టులకు.. తీరా అతడు ప్రవేశపెట్టిన కార్మిక బీమా సొమ్ములే ఆసరాగా మారాయి.
డిజిటల్ మీడియా ప్రభావం
2024 తర్వాత ఈనాడు సహా అన్ని పత్రికలు మూతపడే అవకాశం ఉంది.. ఓవైపు పత్రిక వ్యయం, నిర్వహణ నానాటికి భారం కావడం, డిజిటల్ మీడియా చొచ్చుకు రావడంతో ఇక ముద్ర ణ మాధ్యమం గత జ్ఞాపకం కానుంది.. ఈనాడు ను చూసి వాత పెట్టుకునే మిగతా యాజమాన్యాలు.. ఈనాడు మూసివేస్తే… అదే దారిలో నడవాలని ఆలోచిస్తున్నాయి.. రష్యా యుద్ధం తర్వాత దిగుమతి చేసుకునే మోడీ పేపర్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు కేంద్రం సుంకాలు విధించడంతో ముద్రణ మాధ్యమంపై కోలుకోలేని దెబ్బ పడింది..

2024 Elections- News Papers
ఎందుకు ఈ రాజకీయరంగులు
ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలకి మౌత్ పేపర్లు ఉన్నాయి.. నిజాలు నిష్పక్షపాతంగా రాయడం మానేయడంతో పేపర్లను ప్రజలు అంతగా విశ్వసించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మోదీని దూషించడంలో నమస్తే తెలంగాణ, చంద్రబాబును విమర్శించడంలో సాక్షి, భారతీయ జనతా పార్టీకి డప్పు కొట్టే వెలుగు… ఎవరికివారు రాజకీయ రంగులు పూలుముకోవడంతో జనాలు ఏవగింపు ప్రదర్శిస్తున్నారు. దీంతో పత్రికలు కొనేవారు లేక, చదివేవారు అంతకన్నా లేక ఆ ప్రభావం ముద్రణ మాధ్యమం మీద పడుతున్నది. వెనుకటికి పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు అనే నానుడి ఉండేది.. అన్నట్టుగానే తమ పెట్టుబడికి ఎక్కడ కూడా నష్టం వాటిల్లకూడదని చాలామంది ఇందులో నుంచి తప్పుకుంటున్నారు. కానీ దీన్నే నమ్ముకున్న వారి జీవితాలను రోడ్డు మీద పడేసి వెళ్తున్నారు