Aditya L1: చంద్రయాత్ర పూర్తయింది.. ఇక సూర్యుడి వద్దకు..

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి సోలార్ మిషన్ ఇది. కరోనాగ్రఫీ అనే పరికరంతో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఇస్రో మిషన్ ను చేపడుతోంది.

  • Written By: Bhaskar
  • Published On:
Aditya L1: చంద్రయాత్ర పూర్తయింది.. ఇక సూర్యుడి వద్దకు..

Aditya L1: చంద్రయాత్ర పూర్తయింది. చంద్రయాన్_3 విజయవంతమైంది. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. అదే ఆదిత్య ఎల్_1. సూర్యుడిపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో ఈ మిషన్ ను చేపట్టింది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు దీనికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 2 అంటే శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్ -1 నింగిలోకి దూసుకెళ్ళనుంది. ” ఆదిత్య ఎల్_1 ను లాంచ్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాకెట్, శాటిలైట్ రెడీగా ఉన్నాయి. లాంచ్ కు రిహార్సల్స్ పూర్తయ్యాయి” అని ఇస్రో అధికారులు ట్విట్టర్ లో వెల్లడించారు.

తొలి సోలార్ మిషన్

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి సోలార్ మిషన్ ఇది. కరోనాగ్రఫీ అనే పరికరంతో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఇస్రో మిషన్ ను చేపడుతోంది. ఇందులోని శాటి లైట్ బరువు 1500 కిలోలు. ఆదిత్య ఎల్_1 ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్1( ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్య లోకి ప్రవేశపెడతారు. ఈ ఆదిత్య ఎల్ _1 మొత్తం 7 పే లోడ్లను నింగిలోకి మోసుకెళ్ళుతుంది. అవి 1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్, 2. అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, 3. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరి మెంట్, 4 ప్లాస్మా అన లైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, 5. సోలార్ లో- ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, 6. హై ఎనర్జీ ఎల్_1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, మాగ్నె టో మీటర్. సూర్య గోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా వీటిని రూపొందించారు.

ఎలా పనిచేస్తాయంటే

ఈ ఏడు పే లోడ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంతో.. సూర్యుడిలోని పొరలైన పోటో స్పియర్(కాంతి మండలం), క్రోమో స్పియర్(వర్ణ మండలం), వెలుపల ఉండే కరోనాను ఇవి అధ్యయనం చేస్తాయి. మొత్తం నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. పీఎస్ ఎల్ వీ_సీ57అనే వాహన నౌక ఈ ఆదిత్య ఎల్_1 ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్తుంది. 177 రోజులపాటు ఇది ప్రయాణం చేస్తుంది..ఆ కక్ష్య లోకి చేరుకుంటుంది. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడి పైకి ఉపగ్రహాలు పంపాయి.. ఆదిత్య ఎల్_ 1 ద్వారా భారత్ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతోంది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు