Aditya L1 Launch: నింగి వైపు నిప్పులు చెరుగుతూ దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1
ఆదిత్య ఎల్ వన్ మిషన్ సూర్యుడి కరోనా, సౌర తుఫాన్లు వంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఆదిత్య యల్ వన్ తాను నిర్దేశించుకున్న లాంగ్ రాజ్ పాయింట్ చేరడానికి సరాసరి 125 రోజుల సమయం పట్టనుంది.

Aditya L1 Launch: మరో ఆశా”కిరణం”నింగి వైపు దూసుకెళ్లింది.నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్ వన్ నింగికి ఎగసింది.అంతరిక్షపు వాతావరణం లో సూర్యుడు పాత్ర ఎలా ఉంది అనే దానిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్ ను ప్రయోగించింది. సరిగ్గా శనివారం ఉదయం 11:50 నిమిషాలకు నెల్లూరు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ మిషన్ భూమి నుంచి నింగిలోకి.. వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల మేర ప్రయాణించి లాగ్ రేంజ్ అండ్ పాయింట్ వద్ద కక్షలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి సూర్యుడిని అధ్యయనం చేయడం ప్రారంభిస్తుంది.
ఈ తాజా ప్రయోగం ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం చూపించనుంది.
ఆదిత్య ఎల్ వన్ మిషన్ సూర్యుడి కరోనా, సౌర తుఫాన్లు వంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఆదిత్య యల్ వన్ తాను నిర్దేశించుకున్న లాంగ్ రాజ్ పాయింట్ చేరడానికి సరాసరి 125 రోజుల సమయం పట్టనుంది. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇది కక్షలోకి చేరుతుంది. ఈ పాయింట్ లో భూమి, సూర్యుడు గురుత్వాకర్తను శక్తులు దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం బ్యాలెన్స్గా వెళ్లనుంది.ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పటికే చంద్రయాన్ 3 తో ప్రపంచం లో భారత్ ప్రత్యేక గుర్తింపుని సాధించుకుంది. ఇప్పుడు ఆదిత్య ఎల్ వన్ తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసుకునేలా సరికొత్త ప్రయోగాన్ని సంధించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియా గురించే చర్చ నడుస్తోంది. భారత్ శాస్త్ర సంకేతిక నైపుణ్యంగురించి ఇతర దేశాలు చర్చించుకుంటున్నాయి. సూర్యుడు ప్రయోగం కలిస్తే పెద్ద దేశాల సరసన నడుమ భారత్ నిలవడం ఖాయం. అది ప్రపంచ దేశాల్లోభారత్ కలిగితురాయిగా నిలవడం తధ్యం.
