Adiseshagiri Rao- Mahesh Babu: మహేష్ ఇతర ఆర్టిస్ట్స్ ని ఇమిటేట్ చేస్తాడు… సొంత బాబాయ్ షాకింగ్ కామెంట్స్
కృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ కౌ బాయ్ మూవీగా తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. అతి పెద్ద విజయం నమోదు చేసింది.

Adiseshagiri Rao- Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు నిర్మాతగా పరిశ్రమలో రాణించారు. కృష్ణ చనిపోయే వరకు ఆయనకు తోడుగా ఉన్నారు. కృష్ణ-ఆదిశేషగిరిరావుల అనుబంధం గురించి చిత్ర వర్గాలు గొప్పగా చెప్పుకుంటారు. అన్నయ్య కృష్ణతో ఆదిశేషగిరిరావు అనేక సినిమాలు నిర్మించారు. ఆయన సలహాదారుగా, మేనేజర్ గా ఆయన పని చేశారు. మే 31న కృష్ణ జయంతి. మరణం అనంతరం వస్తున్న కృష్ణ మొదటి జయంతి ఇది. అందుకే ఆయనకు ఘన నివాళి ఇవ్వాలని ఆదిశేషగిరిరావు నిర్ణయించారు.
కృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ కౌ బాయ్ మూవీగా తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఈ చిత్ర రీరిలీజ్ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మహేష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ లో మనకు తెలియని కోణాలు బయటపెట్టారు.
మహేష్ బాబు గురించి బయటవాళ్లకు తెలిసింది చాలా తక్కువ. మహేష్ ఇతర ఆర్టిస్ట్స్ సులభంగా ఇమిటేట్ చేస్తాడు. ఎవరి వాయిస్ అయినా మిమిక్రీ చేయగలడు. నటలో కూడా గొప్ప ప్రతిభ ఉంది. ప్రతి భావోద్వేగం అద్భుతంగా పలికించగలడు. అమితాబ్ బచ్చన్ కి ఉన్నంత ప్రతిభ ఉంది. కొడుకు దిద్దిన కాపురం మూవీ అప్పుడే మహేష్ స్టార్ అవుతాడని అనుకున్నాము. డాన్స్ కష్టపడి నేర్చుకున్నాడు. ఈ మధ్య డాన్సులు కూడా ఇరగదీస్తున్నాడు. చిన్నప్పుడు మహేష్ బాగా అల్లరి చేసేవాడని, ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు.
మహేష్ గురించి బాబాయ్ ఆదిశేషగిరిరావు చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నారు. జూన్ నుండి లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. 2024 జనవరి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.