Adhika Sravana Masam 2023: అధిక మాసం ఎందుకు వస్తుంది? ఈ సమయంలో ఏం చేయకూడదు?
ఆంగ్ల క్యాలెండ్ ప్రకారం నెలలో 30 లేదా 31 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు. కానీ జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. చాంద్రాయానంను సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా సంవత్సరాన్ని లెక్కిస్తారు. చంద్రాయానంలో నెలలో 29.53 రోజులే వస్తాయి. ఇలా సంవత్సరానికి 11 రోజులు తేడా ఉంటాయి. ఇలా నాలుగు సంవత్సరాలకు 31 రోజులు అధికంగా వస్తాయి. దీనినే అధికమాసం అంటారు. 32 నెలల తర్వాత వచ్చే ఈ మాసాన్ని అధికంగా వచ్చిందని చెబుతూ లెక్కగడుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Adhika Sravana Masam 2023: 2023 సంవత్సరంలో అధిక మాసం ఏర్పడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. తెలుగు సంవత్సరాది ప్రకారం శ్రావణ మాసం రెండు నెలల్లో ఉంటుందని చెబుతున్నారు. శ్రావణం అనగానే శుభకార్యాల నెలగా భావిస్తారు. కానీ ఈసారి ఆషాఢ మాసం తరువాత వచ్చే శ్రావణంలో ఎలాటి శుభకార్యాలు నిర్వహించద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అధికమాసం అంటే ఏమిటి? ఈ మాసంలో ఏంచేయాలి? ఏం చేయకూడదు? అనే సందేహం చాలా మందిలో ఉంది.
ఆంగ్ల క్యాలెండ్ ప్రకారం నెలలో 30 లేదా 31 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు. కానీ జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. చాంద్రాయానంను సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా సంవత్సరాన్ని లెక్కిస్తారు. చంద్రాయానంలో నెలలో 29.53 రోజులే వస్తాయి. ఇలా సంవత్సరానికి 11 రోజులు తేడా ఉంటాయి. ఇలా నాలుగు సంవత్సరాలకు 31 రోజులు అధికంగా వస్తాయి. దీనినే అధికమాసం అంటారు. 32 నెలల తర్వాత వచ్చే ఈ మాసాన్ని అధికంగా వచ్చిందని చెబుతూ లెక్కగడుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
2020లో సెప్టెంబర్ 18 నుంచి అధిక మాసం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పుడు 2023 జూలై 18 నుంచి అధిక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి అధికంగా శ్రావణమాసం ఏర్పడుతుంది. చాలా మంది ఆషాఢం పూర్తి కాగానే శ్రావణ మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఈసారి ఆగస్టు 17 గురువారం నుంచి 15 సెప్టెంబర్ 2023 వరకు అసలైన శ్రావణం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి వంటి పండుగలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
అయితే అధికంగా వచ్చే శ్రావణ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేయకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. కానీ ఈ మాసం మహావిష్ణువుకు ఇష్టమైనదిగా చెబుతున్నారు. ఈ మాసంలో విష్ణు సహస్రనామాలు పఠించడం, పితృఆరాధన, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల విశేష ఫలితాన్నిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా అనాథలకు, మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల శుభ పలితాలు కలుగుతాయని చెబుతున్నారు.